మలబద్ధకంతో మదన పడుతున్నారా.. బొప్పాయిని ఇలా తీసుకుంటే దెబ్బకు పరారవుతుంది!

బయటకు చెప్పుకోలేని సమస్యల్లో మలబద్ధకం ఒకటి.చాలా మంది ఈ సమస్య గురించి ఇతరులతో చర్చించేందుకు సంకోచిస్తుంటారు.

అయితే మలబద్ధకం అనుకున్నంత చిన్న సమస్య ఏమి కాదు.దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఎన్నో రోగాలను ఆహ్వానించినట్లే అవుతుంది.

పైగా మలబద్ధకం( Constipation ) కారణంగా ఎప్పుడూ మూడీగా ఉంటారు.ఏకాగ్రత తగ్గిపోతుంది.

ఆకలి కూడా సరిగ్గా ఉండదు.అందుకే ఎక్కువ శాతం మంది మలబద్ధకం సమస్యను వదిలించుకునేందుకు మందులు వాడుతుంటారు.

కానీ సహజంగా కూడా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.అందుకు బొప్పాయి అద్భుతంగా సహాయపడుతుంది.

ముఖ్యంగా బొప్పాయిని( Raw Papaya ) పచ్చిగా తీసుకుంటే ఎలాంటి మలబద్ధకం అయినా సరే దెబ్బకు పరార్ అవుతుంది.

ఎందుకంటే పచ్చి బొప్పాయిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి సహాయపడుతుంది.

ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది.మలబద్ధకం సమస్యను తరిమి త‌రిమి కొడుతుంది.

"""/" / అలాగే పచ్చి బొప్పాయి పాపైన్ వంటి ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది.

ఇది హానికర సూక్ష్మజీవులను బయటకు పంపి వేయడంలో, కడుపులో టాక్సిన్ లేకుండా చేయడంలో హెల్ప్ చేస్తుంది.

అందుకే మలబద్ధకంతో మదన పడుతున్నవారు పచ్చి బొప్పాయిని తీసుకునేందుకు ప్రయత్నించ‌మ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

"""/" / అయితే పచ్చి బొప్పాయిని ఎలా తీసుకోవాలి అనే డౌట్ చాలా మందికి ఉంటుంది.

పీల్ తొల‌గించి నేరుగా ప‌చ్చి బొప్ప‌యిని తినొచ్చు.లేదా మిక్సీ జార్ లో ఒక కప్పు పచ్చి బొప్పాయి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఆ జ్యూస్ లో చిటికెడు సాల్ట్, వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం( Lemonade ), వన్ టేబుల్ స్పూన్ నానబెట్టిన సబ్జా గింజలు కలిపి తీసుకోవచ్చు.

లేదా పచ్చి బొప్పాయిని సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు.ఇలా తీసుకున్నా ఆరోగ్యానికి ప‌చ్చి బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది.

కానీ అతిగా తీసుకుంటే మాత్రం అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది.

వైరల్: మనిషివేనా నువ్వు అసలు.. పొలంలో మేస్తుందని ఒంటె కాలుని నరికేసిన వ్యక్తి..