Vegetables : కూర‌గాయ‌లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలా.. అయితే ఈ టిప్స్ త‌ప్ప‌క తెలుసుకోండి!

మన ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే ఆహారాల్లో కూరగాయలు( Vegetables ) ముందు వరుసలో ఉంటాయి.

కూరగాయలు మనకు విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ప్రోటీన్ వంటి ఎన్నో పోషకాలను అందిస్తాయి.

ఏ రోజు కారోజు తాజా కూరగాయలను కొనుగోలు చేసి తినడం కంటే ఉత్తమం మ‌రొక‌టి ఉండ‌దు.

ఇలా తిన‌డం వ‌ల్ల పోష‌కాల‌ను కోల్పోకుండా ఉంటాయి.రుచి కూడా త‌గ్గ‌కుండా ఉంటుంది.

కానీ నేటి కాలంలో బిజీ లైఫ్ స్టైల్ కార‌ణంగా నిత్యం ఫ్రెష్‌గా కూర‌గాయ‌లు కొనేంత స‌మయం ఎవ‌రికీ ఉండ‌టం లేదు.

వారం లేదా ప‌ది రోజుల‌కు స‌రిప‌డా కూర‌గాయ‌ల‌ను ఓకేసారి తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్( Refrigerator ) చేసుకోవ‌డం అంద‌రికీ అల‌వాటుగా మారిపోయింది.

అయితే ప్ర‌స్తుతం స‌మ్మ‌ర్ స్టార్ట్‌ అయింది.ఈ సీజ‌న్ లో ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా కూర‌గాయ‌లు నిల్వ ఆగ‌వు.

చాలా త్వ‌ర‌గా పాడైపోతాయి.ఈ నేప‌థ్యంలోనే కూర‌గాయ‌లు ఎక్కువ రోజులు నిల్వ ఉండానికి ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

"""/"/ మార్కెట్ నుంచి కూర‌గాయ‌ల‌ను తెచ్చుకున్న త‌ర్వాత శుభ్రంగా వాట‌ర్ తో క‌డిగి కాట‌న్ క్లాత్( Cotton Cloth ) తో పూర్తి తుడ‌వంటి.

వాట‌ర్ తో క్లీన్ చేయ‌డం వ‌ల్ల కూర‌గాయ‌ల‌పై బ్యాక్టీరియా( Bacteria ) తొల‌గిపోతుంది.

అలాగే చాలా మంది కూర‌గాయ‌ల‌న్నిటినీ ఒకే క‌వ‌ర్ లో వేసేస్తారు.కానీ ఇలా చేయ‌డం వ‌ల్ల త్వ‌ర‌గా చెడిపోతాయి.

వేటిక‌వి స‌ప‌రేట్‌గా పెట్టుకోవాలి.అలాగే పండ్లు, కూర‌గాయ‌లు ఒకే చోట పెట్ట‌కూడ‌దు.

చాలా రకాల పండ్లు ఇథిలీన్ అనే వాయువును రిలీజ్‌ చేస్తాయి.ఈ వాయువు కూరగాయలను త్వరగా పాడు చేస్తుంది.

"""/"/ మిగతా కూరగాయలతో పోలిస్తే పచ్చిమిర్చి( Chilli ) చాలా తొందరగా చెడిపోతాయి.

కానీ కాండం తీసేసి ఫిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే దాదాపు ఇర‌వై రోజుల పాటు నిల్వ ఉంటాయి.

అలాగే ఆకూకుర‌ల‌ను ఫ్రెష్‌గా ఉండాలంటే.వేర్లు కట్ చేసి శుభ్రంగా బాగు చేసుకోవాలి.

ఆపై పేప‌ర్ ట‌వ‌ల్ లో చుట్టి కంటైనర్‌లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టింది.

ఇలా చేయ‌డం తాజాదనం ఎక్కువ రోజులు ఉంటుంది.బంగాళాదుంప, చిలగడదుంపల‌ను రిఫ్రిజిరేటర్ లో కాకుండా గది ఉష్ణోగ్రతలో ఉంచేతేనే త్వ‌ర‌గా పాడ‌వ‌కుండా ఉంటాయి.

ఇక టమాటాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం అనవసరం.ఎందుకంటే బయటే ఎక్కువ రోజులు ఉంటాయి.

పండిన టమాటాలు( Tomatoes ) గది ఉష్ణోగ్రతలో వారం రోజులు చెడిపోకుండా ఉంటాయి.

ఆ వ్యక్తితో సమంత డేటింగ్ అంటూ జోరుగా ప్రచారం.. ఆ డైరెక్టర్ ఎవరంటే?