చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుందా? డోంట్ వర్రీ వెంటనే ఇలా చేయండి!

ప్రస్తుత రోజుల్లో కొందరు చిన్న వయసులోనే తెల్ల జుట్టు( White Hair ) సమస్యతో బాధపడుతున్నారు.

ఆహారపు అలవాట్లు, పెరిగిన కాలుష్యం, ధూమ‌పానం, మద్యపానం, ఒత్తిడి తదితర కారణాల వల్ల జుట్టు త్వరగా తెల్లబడుతుంటుంది.

ఇక తలలో తెల్ల వెంట్రుకలు చూడగానే ఎక్కడలేని టెన్షన్ వచ్చేస్తుంది.అప్పుడే తెల్ల జుట్టా అనుకుంటూ తెగ హైరానా పడిపోతుంటారు.

కానీ వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని పాటిస్తే జుట్టు తెల్లబడడాన్ని సుల‌భంగా కంట్రోల్ చేయవచ్చు.

అలాగే తెల్లబడిన జుట్టును మళ్ళీ నల్లగా మార్చుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో నాలుగు బాదం పప్పులు( Almonds ) వేసుకోవాలి.

అలాగే ఒక కప్పు ఉల్లి తొక్కలు మరియు రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek ) వేసి నల్లగా మారేంతవరకు వేయించుకోవాలి.

వేయించుకున్న బాదం పప్పు, ఉల్లి తొక్కలు మరియు మెంతులు మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / ఆ తర్వాత ఒక బౌల్‌ తీసుకుని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు తయారు చేసి పెట్టుకున్న పొడి వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్లు కోకోనట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

"""/" / నాలుగు గంటల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.

వారంలో రెండు సార్లు కనుక ఇలా చేస్తే జుట్టు తెల్లబడకుండా ఉంటుంది.మరియు తెల్లబడిన జుట్టు సహజంగానే నల్లగా మారుతుంది.

పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల కురులు ఒత్తుగా పొడుగ్గా కూడా పెరుగుతాయి.

కాబట్టి ఎవరైతే చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుందని వర్రీ అవుతున్నారో వారు తప్పకుండా ఇప్పుడు చెప్పిన రెమెడీని పాటించండి.

జుట్టును నల్లగా మెరిపించుకోండి.

అల్లు అర్జున్ పై నాగబాబు షాకింగ్ కామెంట్స్… తప్పు తెలుసుకున్నారా?