Pomegranate : దానిమ్మ తొక్కలు పారేస్తున్నారా.. ఇలా వాడారంటే మీ జుట్టు ఊడమన్నా ఊడదు!

పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు అందరూ ఇష్టంగా తినే ఫ్రూట్స్ లో దానిమ్మ( Pomegranate ) ఒకటి.

తినడానికి రుచికరంగా ఉండడమే కాదు.దానిమ్మలో పోషకాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి.

అందువల్ల ఆరోగ్యానికి దానిమ్మ అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది.అయితే దానిమ్మ తినే సమయంలో ఆల్మోస్ట్ అందరూ తొక్కలు పారేస్తుంటారు.

కానీ దానిమ్మ గింజల్లోనే కాదు తొక్కల్లోనూ పోషకాలు ఉంటాయి.దానిమ్మ తొక్కలు మనకు అనేక విధాలుగా ఉపయోగపడతాయి.

ముఖ్యంగా జుట్టు సంరక్షణకు దానిమ్మ తొక్కలు చాలా అద్భుతంగా తోడ్పడతాయి.మరి ఇంతకీ దానిమ్మ తొక్కలను జుట్టుకు ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా దానిమ్మ తొక్కలను ఎండబెట్టుకోవాలి.పూర్తిగా ఎండిన తర్వాత వాటిని మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు దానిమ్మ తొక్కల పొడి( Pomegranate Peel Powder ) వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెరుగు( Curd ) , రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె ( Coconut Oil )మరియు సరిపడా వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు అప్లై చేసుకొని కనీసం 10 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.

ఆపై షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

"""/" / దానిమ్మ తొక్కలో విటమిన్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు( Antioxidants ) ఉంటాయి.

ఇవి జుట్టును మూలాల నుంచి స్ట్రాంగ్ గా మారుస్తాయి.జుట్టు రాలడాన్ని అరికడతాయి.

ఇప్పుడు చెప్పిన విధంగా దానిమ్మ తొక్కలను ఉపయోగించారంటే హెయిర్ ఫాల్ సమస్యకు సుల‌భంగా అడ్డుకట్ట వేయవచ్చు.

పైగా ఈ రెమెడీ జుట్టు ఎదుగుదల ను పెంచుతుంది.ఒత్తుగా పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

యూకే : గ్రాడ్యుయేట్ రూట్ వీసా స్కీమ్ రద్దు దిశగా రిషి సునాక్ .. కేబినెట్ నుంచి నిరసన సెగ