జుట్టు రాలడాన్ని అరికట్టే ఉల్లితొక్కలు.. ఇంతకీ ఎలా వాడాలో తెలుసా?
TeluguStop.com
నిత్యం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉల్లిపాయలను విరివిరిగా పడుతుంటారు.అసలు ఉల్లిపాయలు లేనిదే వంట సంపూర్ణం కాదు.
అయితే ఉల్లిపాయలకు ఉండే తొక్కలను దాదాపు అందరూ డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటారు.
అయితే ఉల్లిపాయలే కాదు ఉల్లి తొక్కలు కూడా మనకు అనేక విధాలుగా ఉపయోగపడతాయి.
ముఖ్యంగా జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు ఉల్లితొక్కలు అద్భుతంగా సహాయపడతాయి.మరి ఇంతకీ ఉల్లి తొక్కలను ఎలా ఉపయోగించాలి అన్నది తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు టీ పౌడర్ వేసి రెండు మూడు నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత ఒక కప్పు ఉల్లి తొక్కలు( Onion Peel ) వేసుకోవాలి.
అలాగే ఒక కప్పు వెల్లుల్లి పొట్టును కూడా వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు బాగా మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను చల్లారబెట్టుకోవాలి./br> """/" /
పూర్తిగా చల్లారిన తర్వాత స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Castor Oil ) వేసి బాగా మిక్స్ చేస్తే మంచి హెయిర్ టోనర్ సిద్ధమవుతుంది.
ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.ఆపై స్కాల్ప్ కు ఒకటికి రెండు సార్లు హెయిర్ టోనర్ ను స్ప్రే చేసుకోవాలి.
రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.
"""/" /
వారానికి రెండు సార్లు ఈ విధంగా కనుక చేస్తే జుట్టు రాలడం క్రమంగా తగ్గిపోతుంది.
అదే సమయంలో కుదుళ్లకు మంచి పోషణ అందుతుంది.దీంతో జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.
అలాగే ఈ హోమ్ మేడ్ హెయిర్ టోనర్ ను వాడటం వల్ల జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉంటుంది.
మరియు జుట్టు చిట్లడం( Hair Fall ), పొట్లి పోవడం వంటి సమస్యలు సైతం తగు ముఖం పడతాయి.
కాబట్టి ఇకపై ఉల్లి తొక్కలను పారేయకుండా ఈ విధంగా ఉపయోగించండి.జుట్టు రాలడాన్ని అరికట్టండి.
వీడియో: ట్రంప్‌పై కోపంతో బంగారం లాంటి టీవీని నాశనం చేసిన యువతులు..