హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేసే పుదీనా.. ఎలా వాడాలంటే?
TeluguStop.com
పుదీనా( Mint ).మంచి సువాసన కలిగి ఉండే ఆకుకూరల్లో ఒకటి.
అయితే పుదీనాను నాన్ వెజ్, బిర్యానీ, పులావ్ వంటి వంటల్లో మాత్రమే వాడుతుంటాము.
కానీ పుదీనాను నిత్యం తీసుకున్నా ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు చేకూరుతాయి.అలాగే జుట్టు సంరక్షణకు సైతం పుదీనా అండగా ఉంటుంది.
మనలో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో సతమతం అవుతుంటారు.అలాంటి వారికి పుదీనా ఒక వరం అని చెప్పుకోవచ్చు.
హెయిర్ ఫాలో కు అడ్డుకట్ట వేసే సామర్థ్యం పుదీనాకు ఉంది.మరి ఇంతకీ పుదీనాను జుట్టుకు ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
ముందుగా ఒక కప్పు పుదీనా ఆకులను తీసుకొని మిక్సీ జార్ లో వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పుదీనా జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe Vera Gel ) , వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Castor Oil ), రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకొని అన్నీ కలిసేలా స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/" /
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ కు అప్లై చేసి కనీసం పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకటి లేదా రెండు సార్లు పుదీనాతో ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.
హెయిర్ ఫాల్ సమస్య క్రమంగా దూరం అవుతుంది.అదే సమయంలో జుట్టు ఒత్తుగా పెరగడం కూడా ప్రారంభం అవుతుంది.
కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ సింపుల్ అండ్ వండర్ ఫుల్ హోమ్ రెమెడీని ట్రై చేయండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.
హాస్టల్ పైనుంచి ఈ అమ్మాయి ఇలా దూకేసింది ఏంటీ.. తర్వాత ఏమైందో చూడండి…