క్యాబేజీ పంట విత్తుకునే విధానం.. దిగుబడి పెంచే మెళుకువలు..!
TeluguStop.com
క్యాబేజీ పంటను( Cabbage Crop ) చల్లటి తేమతో కూడిన వాతావరణం లో సాగు చేస్తే ఆశించిన స్థాయిలో మంచి దిగుబడులు పొందవచ్చు.
అయితే క్యాబేజీ పంట సాగులో కొన్ని మెళుకువలు పాటిస్తే అధిక శ్రమ లేకుండా పంట సాగు చేయవచ్చు.
అయితే అధిక విస్తీర్ణంలో ఒకేసారి క్యాబేజీ పంటను సాగు చేయకుండా విడతల వారీగా వేసుకోవడం మంచిది.
క్యాబేజీ పంట సాగుకు నల్లరేగడి నేలలు, ఎర్రనేలలు( Black Soils, Red Soils ) చాలా అనుకూలంగా ఉంటాయి.
నేల యొక్క పీహెచ్ విలువ 5.5-6.
5 ఉండే నేలలు ఈ పంట సాగుకు అనుకూలం.వేసవికాలంలో నేలను లోతు దుక్కులు దున్నుకొని, ఆఖరి దుక్కిలో ఒక ఎకరాకు పది టన్నుల పశువుల ఎరువు వేసి పొలాన్ని కలియదున్నాలి.
40 కిలోల పొటాష్, 40 కిలోల భాస్వరం ను ఆఖరి దుక్కిలో వేయాలి.
"""/" /
క్యాబేజీ పంట విత్తుకునే విధానంలో పాటించాల్సిన మెళుకువల విషయానికొస్తే.ఒక ఎకరాకు 200 గ్రాముల విత్తనాలు అవసరం.
ఒక కిలో విత్తనాలకు మూడు గ్రాముల తైరంతో లేదంటే కార్బండిజం( Carbandism ) తో విత్తన శుద్ధి చేసుకోవాలి.
ఇక ఆరోగ్యకరమైన నారు పొందాలంటే.10 నుండి 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండే నారుమడులను ఏర్పాటు చేసుకోవాలి.
మడులపై అచ్చుగా సమాన దూరంలో గీతలు గీసుకుని విత్తనాలను వేసి మెత్తటి మట్టితో కప్పేయాలి.
ఇక విత్తనాలకు నీటిని అందించి నారుమడిపై వరిగడ్డిని పలుచగా పరచాలి.నేలపై నారు పెంచితే మడులలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
ట్రేలలో విత్తుకోవడం వల్ల నారుకు ఆకు తినే పురుగులు ఆశించకుండా ఉంటాయి.ఒకవేళ క్యాబేజీ నారుకు ఆకుతినే పురుగులు ఆశిస్తే ఒక లీటరు నీటిలో 2.
5 Ml మాలాథియాన్( Malathion ) ను కలిపి పిచికారి చేయాలి. """/" /
ఇక 25 నుంచి 30 రోజుల వయసు ఉండే నారు ను పొలంలో నాటుకోవాలి.
మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకుంటే మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.
ఒక ఎకరం పొలంలో 16 వేల మొక్కలు నాటుకోవచ్చు.నేలలోని తేమశాతాన్ని బట్టి పది రోజులకు ఒకసారి పంటకు నీటి తడి అందించడంతోపాటు పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటూ సాగు చేస్తే మంచి దిగుబడి పొందవచ్చు.
చంద్రబాబు హామీ : వంగవీటి రాధా దశ తిరగబోతోందా ?