Ladies Finger Crop : బెండ పంటను విత్తుకునే విధానం.. పోషక యాజమాన్యంలో మెళుకువలు..!

బెండ పంటను( Ladies Finger Crop ) ఏడాది పొడవునా ఏ కాలంలో అయినా సాగు చేయవచ్చు.

వేడి వాతావరణం ఉంటే అధిక దిగుబడి సాధించవచ్చు.కాబట్టి బెండ పంటను వేసవి కాలంలో సాగు చేస్తే ఆశించిన స్థాయిలో మంచి దిగుబడులు పొంది మంచి లాభాలు ఆర్జించవచ్చు.

నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, నీరు ఇంకిపోయే సారవంతమైన నేలలు బెండ పంట సాగుకు చాలా అనుకూలం.

బెండ పంటను విత్తుకునే విధానంపై అవగాహన ఉంటే వివిధ రకాల చీడపీడలు, తెగుళ్లు పంటకు నష్టం కలిగించకుండా పంటను సంరక్షించుకోవచ్చు.

"""/" / బెండ పంటను విత్తుకోవడానికి ముందు వేసవికాలంలో నేలను రెండుసార్లు దుక్కి దున్నాలి.

ఒక ఎకరాకు పది టన్నుల పశువుల ఎరువు వేసి చివరి దుక్కి దున్నుకోవాలి.

బెండ పంటను రెండు రకాలుగా విత్తుకోవచ్చు.బోదెల పద్ధతి లేదంటే సాలుల పద్ధతి ద్వారా బెండ పంటను సాగు చేస్తారు.

అయితే బోధన పద్ధతి ద్వారా సాగు చేస్తే.డ్రిప్ విధానం ద్వారా నీటిని అందించడానికి చాలా అనువుగా ఉంటుంది.

డ్రిప్ విధానం( Drip Method ) ద్వారా సాగు చేస్తే దాదాపుగా కలుపు సమస్య లేనట్టే.

కలుపు సమస్య లేకపోతే చీడపీడల, తెగుళ్ల బెడద తక్కువగా ఉంటుంది. """/" / ఒక ఎకరానికి దేశీయ రకం విత్తనాలు అయితే నాలుగు కిలోలు అవసరం.

అదే హైబ్రిడ్ విత్తనాలు అయితే ఒక ఎకరాకు 2.5 కిలోల విత్తనాల అవసరం.

హైబ్రిడ్ విత్తనాలు విత్తన శుద్ధి చేసి వస్తాయి కాబట్టి వాటికి విత్తన శుద్ధి అవసరం ఉండదు.

దేశీయ రకం విత్తనాలు అయితే ఒక కిలో విత్తనాలకు ఐదు మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి.

పోషక యాజమాన్య పద్ధతుల విషయానికి వస్తే.ఒక ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 35 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు వేసి నేలను దమ్ము చేసుకోవాలి.

బోధన పద్ధతి ద్వారా విత్తనం విత్తుకునేటప్పుడు విత్తనాలను విత్తుకుని మల్చింగ్ కవర్ ని ఏర్పాటు చేయాలి.

దీనివల్ల కలుపు నివారణ( Weed Control )తో పాటు నీరు వృధా అవ్వదు.

ఇక మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకుంటే మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.

పంట 30 నుంచి 40 రోజుల దశలో ఉన్నప్పుడు ఎకరాకి 30 కిలోల యూరియాను రెండు దశలు అందించాలి.

పంట పూత దశలో ఉన్నప్పుడు పూత బలంగా ఉండడం కోసం ఒక లీటర్ నీటిలో ఐదు గ్రాముల సూక్ష్మదాతు+ ఐదు గ్రాముల 19:19:19 ను కలిపి రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి.

ఇక ఏవైనా చీడపీడలు లేదంటే తెగుళ్లు ఆశిస్తే, తొలిదశలోనే వాటిని అరికట్టి పంటను సంరక్షించుకోవాలి.