ఒకసారి వాడిన నూనెను పారబోస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!
TeluguStop.com
ఒక సారి వంటలకు వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడకూడదని డాక్టర్లు పదే పదే హెచ్చరిస్తుంటారు.
ఎందుకంటే, ఒకసారి యూజ్ చేసిన ఆయిల్‌ను మళ్లీ వాడటం వల్ల బరువు పెరగడం, గుండె జబ్బులు, జీర్ణ సంబంధిత సమస్యలు, క్యాన్సర్, కొలెస్ట్రాల్ స్థాయిలు అధికమవడం ఇలా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈ నేపథ్యంలోనే చాలా మంది నూనెను ఒక సారి వాడిన తర్వాత బయట పారబోస్తుంటారు.
అయితే ఇకపై మాత్రం అలా పారబోయకండి.ఒక సారి వాడిన నూనెను మళ్లీ వంటలకు కాకుండా.
ఇతరితర విధాలుగా వాడుకోవచ్చు.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో ఉండే ఫర్నిచర్‌ను తళతళా మెరిపించడానికి ఈ నూనె అద్భుతంగా సహాయపడుతుంది.అవును, వంటలకు ఒక సారి వాడిన నూనెలో కొద్దిగా వెనిగర్ మిక్స్ చేసి ఫర్నిచర్‌ను క్లీన్ చేస్తే కొత్త వాటిలా మెరుస్తాయి.
అలాగే వాడేసిన వంట నూనెను లైట్‌గా వేడి చేసి కేశాలకు పట్టించాలి.అర గంట తర్వాత కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూతో తల స్నానం చేయాలి.
ఇలా చేయడం వల్ల జుట్టు షైనీ, సిల్కీగా మారుతుంది.లెదర్‌తో తయారు చేసిన షూస్, బ్యాగ్స మరియు ఇతరితర వస్తులను వాడేసిన వంట నూనెతో తుడుచుకోవాలి.
తద్వారా ఆ వస్తువులు చక్కగా మెరుస్తాయి. """/"/
ఇక ప్రస్తుతం వర్షకాలం.
ఈ సీజన్‌లో ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ పోతుంటుంది.అలాంటి సమయంలో వాడేసిన వంట నూనెను ప్రమిదల్లో పోసి దీపాలు పెట్టుకోవచ్చు.
దాంతో క్యాండిల్స్ ఖర్చు ఉండదు.అలాగే వంట చేసే సమయంలోనూ, పిల్లల కారణంగానూ గోడలపై మరకలు పడుతూ ఉంటాయి.
అయితే ఈ మరకలపై వాడేసిన వంట నూనెను కాటన్ క్లాత్ సాయంతో రుద్దాలి.
ఇలా చేస్తే మరకాలు పోతాయి.
తొలిప్రేమ రెమ్యూనరేషన్ తో పవన్ అలాంటి పని చేశారా… ఏమైందంటే?