కళ్ల కింద నలుపును సులువుగా తగ్గించే హోమ్ రెమెడీస్!!
TeluguStop.com

చాలా మంది కళ్ల కింద నలుపు లేదా నల్లటి వలయాల సమస్యతో బాధపడుతుంటారు.


ముఖ్యంగా ఆడవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.అలాంటి వారు ఎంత అందంగా ఉన్నా.


ఈ నల్లటి వలయాల వల్ల అంద విహీనంగానే కనిపిస్తారు.మానసిక ఒత్తిడి, నిద్రలేమి, పోషకాహార లోపం వల్ల కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడతాయి.
ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఏవేవో క్రీములు వాడుతుంటారు.అయినప్పటికీ ఫలితం లేక నిరాశ చెందుతారు.
కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే హోమ్ రెమెడీస్ ఫాలో అయితే ఖచ్చితంగా కళ్ల కింద నలుపును తగ్గించుకోవచ్చు.
ముందుగా ఒక టీ స్పూన్ టమోటో రసం, ఒక టీ స్పూన్ నిమ్మరసం తీసుకుని మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని కళ్ల కింద అప్లై చేయండి.పావు గంట పాటు ఆరనిచ్చి.
అనంతరం చల్లటి నీటితో క్లీన్ చేసుకోండి.రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే.
కళ్ల కింద నలుపు మాయం అవుతుంది. """/" /
అలాగే కొన్ని పుదీనా ఆకుల్ని తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని కంటిచుట్టూ ప్యాక్‌లా వేసి.పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోండి.
వారానికి మూడు సార్లు ఇలా చేస్తే.మంచి ఫలితం ఉంటుంది.
ప్రతి రోజు నిద్రించే ముందు రోజ్ వాటర్ కంటి కింద అప్లై చేసి పడుకోవాలి.
ఇలా చేయడం వల్ల కూడా నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.బంగాళదుంప రసం తీసుకుని.
కళ్ల కింద అప్లై చేయండి.పావు గంట పాటు ఆరనిచ్చి.
అనంతరం చల్లటి నీటితో క్లీన్ చేసుకోండి.వారానికి మూడు, నాలుగు సార్లు ఇలా చేస్తే కళ్ల కింద నలుపు మాయం అవుతుంది.
ఇక ఈ హోమ్ రెమెడీస్‌తో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.మరియు నిద్ర పోవాలి.
మా ఇంట్లో వారే అలాంటి పక్షపాతం చూపేవారు… ఎమోషనల్ అయిన విష్ణు ప్రియ!