అధిక ర‌క్త‌పోటును సులువుగా కంట్రోల్ చేసే సింపుల్‌ టిప్స్‌!

అధిక ర‌క్త‌పోటు లేదా హైబీపీ‌.నేటి కాలంలో ఈ స‌మ‌స్య‌తో చాలా మంది ఇబ్బంది ప‌డుతున్నారు.

రక్త నాళాల ద్వారా పెరిగే ఒత్తిడినే రక్తపోటు అంటారు.అయితే సాధార‌ణంగా చాలా మంది ఇత‌ర వ్యాధుల‌ను ప‌ట్టించుకున్నంత ఎక్కువ‌గా అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య‌ను ప‌ట్టించుకోరు.

కానీ, అదే మీరు చేసే పొర‌పాటు.ఎందుకంటే.

అధిక ర‌క్త‌పోటు చిన్న స‌మ‌స్య అయిన‌ప్ప‌టికీ.ప్రాణాంతకమైన‌ది అన‌డంలో సందేహ‌మే లేదు.

చాప కింద నీరులా ఎంతో మందిని ఈ స‌మ‌స్య క‌బ‌లించింది.అందుకే అధిక ర‌క్త‌పోటును కంట్రోల్ చేసుకోవ‌డం చాలా ముఖ్యం.

ఇక ఈ స‌మ‌స్య‌ను త‌గ్గించుకునేందుకు చాలా మంది మందులు వాడుతుంటారు.కానీ, మందులు వాడకుండా కూడా ర‌క్త‌పోటును కంట్రోల్ చేసుకోవ‌చ్చు.

అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.అధిక ర‌క్త‌పోటు ఉన్న వారు ముందుగా చేయాల్సింది ఉప్పును చాలా త‌క్కువ ప‌రిమాణంలో మాత్ర‌మే తీసుకోవాలి.

నిల్వ పచ్చళ్ల‌కు దూరంగా ఉండాలి.అలాగే అధిక ర‌క్త‌పోటుతో బాధప‌డేవారు శ‌రీర బ‌రువును నియంత్ర‌ణ‌లో ఉంచుకోవాలి.

ఎందుకంటే.అధిక బ‌రువు వ‌ల్లే గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి స‌మ‌స్యలు త‌లెత్తుతాయి.

తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవ‌డం వ‌ల్ల కూడా అధిక ర‌క్త‌పోటు అదుపులోకి వ‌స్తుంద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అలాగే డార్క్ చాక్లెట్స్‌ కూడా హైబీపీని అదుపు చేయ‌గ‌ల‌దు.కాబ‌ట్టి, ప‌రిమితిని మించ‌కుండా డార్క్ చాక్లెట్స్ తీసుకుంటే.

అధిక ర‌క్త‌పోటుకు చెక్ పెట్ట‌వ‌చ్చు.ఆల్కహాల్ మ‌రియు పొగాకు ఉత్పత్తుల‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఎందుకంటే.ఈ అల‌వాట్ల వ‌ల్ల అధిర ర‌క్త‌పోటు మ‌రింత పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి.

ఇక అధిర ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డేవారు ఖ‌చ్చితంగా క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేయాలి.త‌ద్వారా కూడా ర‌క్త‌పోటు అదుపులోకి వ‌స్తుంది.

పొటాషియం త‌క్కువ ఉండ‌టం వ‌ల్ల అధిక ర‌క్త‌పోటు వ‌స్తుంది.కాబ‌ట్టి, పొటాషియం ఉన్న ఆహార‌న్ని డైట్‌లో చేర్చుకోవాలి.

రాజమౌళి తర్వాత సినిమాలో హీరో అతనేనా.. ఆ క్రేజీ హీరోకు ఛాన్స్ దక్కిందా?