మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీకు నిద్ర సరిపోవ‌ట్లేదు బాసు!

ఆరోగ్యమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే పోషకాహారం తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం మాత్రమే కాదు కంటి నిండా నిద్ర ఉండేలా కూడా చూసుకోవాలి.

మన శరీరానికి ఆహారం ఎంత అవ‌స‌ర‌మో నిద్ర( Sleep ) అంతక‌న్నా ఎక్కువ అవసరం.

మనకు వచ్చే సగం శాతం జబ్బులకు( Diseases ) కంటి నిండా నిద్ర లేకపోవడం కూడా ఒక కారణం.

అందుకే కంటి నిండా నిద్రపోవాలని అంటారు.ఇక మనకు ఎన్ని గంటల నిద్ర అవసరమనేది కచ్చితంగా తెలియదు.

వ్యక్తుల అవసరాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది.నిపుణులు మాత్రం రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రించాలని సూచిస్తారు.

ఆ విషయం పక్కన పెడితే.మనకు నిద్ర సరిపోతుందా, లేదా అని తెలుసుకోవడం ఎలా? అనే డౌట్ చాలామందికి ఉంటుంది.

అయితే నిద్ర సరిపోవడం లేదు అని సూచించడానికి మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. """/" / పగటిపూట ఆఫీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు కునుకు పాట్లు పడుతున్నారా.

? డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మత్తుగా అనిపిస్తుందా.? అయితే మీకు నిద్ర సరిపోవడం లేదని( Sleep Deprivation ) అర్థం.

మెలకువగా చురుగ్గా ఉండాల్సిన టైంలో నిద్ర వస్తుంటే రాత్రిపూట మీరు సరిగ్గా నిద్రపోనట్లే.

అలాగే కొందరు సెలవు దినాల్లో పగటిపూట గంటలు కొద్ది నిద్రపోతుంటారు.మీరు ఇలా చేస్తున్నారా.

? అంటే మిగతా రోజుల్లో మీరు సరిగ్గా నిద్రపోవడం లేదని అర్థం.కోల్పోయిన నిద్రను భ‌ర్తీ చేసుకునే క్రమంలో శరీరం ఈ విధంగా వెసులుబాటు ఉన్న సమయంలో విశ్రాంతి కోరుకుంటుంది.

ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. """/" / ఇక కొందరికి రోజు ఉదయం అలారం మోగితే కానీ మెలుకువ రాదు.

మీకు నిద్ర సరిపోవడం లేద‌ని చెప్పడానికి ఇది కూడా ఒక సూచిక‌.మన నిద్ర మెలుకువులను జీవగడియారం నియంత్రిస్తుంటుంది.

కంటి నిండా నిద్ర పోతే అలారంతో అవసరం ఉండదు.ప్రతిరోజు కరెక్ట్ టైమ్ కు మెలుకువ వస్తుంది.

సో.ఇక నుంచైనా టీవీ, ఫోన్లతో గడపడం మాని నిద్రకు సరైన సమయాన్ని కేటాయించండి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్29, శుక్రవారం 2024