మీ ఫ్యామిలీలో ఎవరికైనా మధుమేహం ఉందా? అయితే మీరీ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
TeluguStop.com
మధుమేహం.ఇటీవల రోజుల్లో కోట్లాది మందిని వణికిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో ఇది ఒకటి.
ఈ వ్యాధికి గురికావడానికి చాలా కారణాలే ఉన్నాయి.అలాగే కొందరికి వంశపారపర్యంగా కూడా మధుమేహం వస్తుంటుంది.
అందుకే ఫ్యామిలీలో ఎవరికైనా మధుమేహం ఉంటే.మిగిలిన వారు తమకు కూడా ఎక్కడ ఈ వ్యాధి వస్తుందో అని ఆందోళన చెందుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే ఓ సూపర్ స్పెషల్ పానియంతో పాటు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం మీ దరి దాపులోలకి కూడా రాదు.
మరి లేటెందుకు అసలు మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం పదండీ.ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల పుచ్చ గింజలు, రెండు టేబుల్ స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్, ఐదు నుంచి ఆరు వాల్ నట్స్, చిన్న దాల్చిన చెక్క, అర స్పూన్ మిరియాలు, రెండు బిర్యానీ ఆకులు, రెండు చిన్న పటిక బెల్లం ముక్కలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
ఈ పొడిని అర స్పూన్ చొప్పున గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి.
ఇలా ప్రతి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళలో తీసుకుంటే.అందులో ఉండే ప్రత్యేకమైన పోషకాలు మధుమేహం బారిన పడకుండా రక్షిస్తుంది.
ఈ పానియంను రోజూ సేవించడంతో పాటు మరికొన్ని జాగ్రత్తలను సైతం పాటించాలి.ముఖ్యంగా మద్యం తాగడం, పొగ త్రాగడం వంటి అలవాట్లను మానుకోవాలి.
ప్రతి రోజు అర గంట పాటు వ్యాయామాలు చేయాలి.వీలైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండాలి.
షుగర్‌తో చేసే ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ ను తీసుకోవడం ఆపేయాలి.
"""/" /
కంటి నిండా నిద్ర పోవాలి.శరీరానికి సరిపడా వాటర్‌ను అందించాలి.
వంటలకు నువ్వుల నూనె, కొబ్బరి నూనె వంటివి ఉపయోగించాలి.మరియు డైట్‌లో తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, నట్స్ వంటివి ఉండేలా చూసుకోవాలి.