తరచూ పాలు పొంగిపోతున్నాయా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
TeluguStop.com
పాలు కాచడం అనేది చిన్న పనే అయినప్పటికీ చాలా రిస్కీ.ఎందుకంటే, పాలు ఎప్పుడు పొంగిపోతాయో అస్సలు చెప్పలేము.
స్టవ్‌పై పాలు పెట్టి అప్పుడే కాగవు కదా అని పక్కకు వెళ్లినా లేదా ఏదైనా ఆలోచిస్తున్నా టక్కున పొంగిపోతుంటాయి.
ఇక ఆ తర్వాత పడే తిప్పలు తెలిసిందే.ఈ పాల పొంగుడు కార్యక్రమం దాదాపు అందరి ఇళ్లల్లోనూ తరచూ జరుగుతుంటుంది.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్‌ను పాటిస్తే.ఇకపై మీ ఇంట్లో పాలు పొంగనే పొంగవు.
మరి ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.పాలు పొంగకుండా ఉండాలీ అంటే.
పాలు కాచే ముందు గిన్నె అంచులకు నెయ్యి లేదా వంట నూనెను అప్లై చేయండి.
ఇలా చేస్తే పాలు పొంగకుండా చక్కగా మరుగుతుంటాయి.అలాగే పాలు కాచే సమయంలో ఒక ఐస్ క్యూబ్ తీసుకుని అందులో వేయాలి.
తద్వారా కూడా పాలు పొంగిపోకుండా ఉంటాయి.అయితే ఒక ఐస్ క్యూబ్ మించి మాత్రం వేయకండి.
ఐస్ క్యూబ్స్ ఎక్కువ వేస్తే పాలు పల్చగా మారిపోతాయి.పాలు కాగబెట్టే గిన్నెపై అడ్డంగా ఒక చెక్క గరెటెను పెట్టండి.
చెక్క గరిటెను పెట్టడం వల్ల పాలు మరిగే సమయంలో వచ్చే అవిరిని అది పీల్చేసుకుంటుంది.
దాంతో పాలు పొంగకుండా ఉంటాయి. """/" /
ఇవన్నీ మేము చేయలేము అని అనుకునే వారు స్టౌ సిమ్ లో ఉంచి ఒక పెద్ద గిన్నెలో పాలు పోసి పెట్టండి.
దాంతో పొంగు రాకుండా చక్కగా మరుగుతాయి.అయితే దీనికి ఎక్కువ సమయం పట్టేస్తుంది.
ఇక పాలు పొంగడమే కాదు ఇరిగిపోవడం కూడా పెద్ద సమస్యే.అయితే పాలు విరగకుండా ఉండాలీ అంటే.
పాలు హీట్ చేసే సమయంలో చిటికెడు సోడా వేయాలి.తద్వారా పాలు ఎక్కువ సమయం పాటు విరగకుండా నిల్వ ఉంటాయి.
సిక్కు ఎన్జీవో సంస్ధ పెద్ద మనసు .. అమెరికా వ్యాప్తంగా ఏకంగా 10 వేల మందికి భోజనం