వేడి వాతావరణం, డీహైడ్రేషన్ వంటి కారణాల వల్ల తరచూ తలనొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
దీన్ని తగ్గించుకోవడం కోసం పెయిన్ కిల్లర్స్‌ను తెగ వాడేస్తుంటారు.కానీ, ఇప్పుడు చెప్పబోయే జాగ్రత్తలను పాటిస్తే గనుక తలనొప్పి మీ దరి దాపుల్లోకి కూడా రాదు.
సమ్మర్‌లో తలనొప్పి దరి చేరకూడదంటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటం ఎంతో అవసరం.అందుకే రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని సేవించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే కొందరు ఎండల్లో వ్యాయామాలు చేస్తుంటారు.దీని వల్ల కూడా తలనొప్పి బారిన పడే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి, సమ్మర్‌లో ఉదయం 7 గంటల లోపే వ్యాయామాలను పూర్తి చేసుకోవాలి.వేసవి కాలంలో సాలిడ్స్ కాకుండా లిక్విడ్స్‌ను అధికంగా తీసుకోవాలి.
ముఖ్యంగా ఫ్రూట్ జ్యూసులు, వెజిటేబుల్ జ్యూసులు, లస్సీలు వంటివి తీసుకుంటే వేసవి వేడిని తట్టుకునే శక్తి లభిస్తుంది.
మరియు తలనొప్పి సమస్యకు కూడా దూరంగా ఉంటారు. """/" /
కూల్‌డ్రింక్స్, సోడాలు, ఆల్కహాల్, టీ, కాఫీ వంటి పానియాలను తీసుకోవడం పూర్తిగా మానేయాలి.
ప్రతి రోజు ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లలో నిమ్మ రసం కలిపి సేవించాలి.
ఇలా చేయడం వల్ల మీ బాడీ కూల్‌గా ఉంటుంది.గంటలు గంటలు ఏసీలో ఉన్న తలనొప్పి వస్తుంది.