గ్యాస్‌తో త‌ర‌చూ బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

గ్యాస్ ట్ర‌బుల్‌ చిన్న స‌మ‌స్యే అయిన‌ప్ప‌టికీ తీవ్ర అసౌక‌ర్యానికి గురి చేస్తూ ఉంటుంది.

ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో మార్పులు, మ‌ద్య‌పానం, పొట్ట‌లో ఇన్ఫెక్ష‌న్‌, తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణం కాక‌పోవ‌డం, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల గ్యాస్ వ‌స్తుంటుంది.

అయితే ఎప్పుడో ఒక సారి ఈ స‌మ‌స్య వ‌స్తే పెద్ద ఇబ్బందేమీ ఉండ‌దు.

కానీ, కొంద‌రిని మాత్రం త‌ర‌చూ గ్యాస్ స‌మ‌స్య వేధిస్తూనే ఉంటుంది.ఇలాంటి వారు ఏ ఆహారం తినాల‌న్నా గ్యాస్ వ‌చ్చేస్తుందేమో అని తెగ భ‌య ప‌డి పోతుంటారు.

వీరి లిస్ట్‌లో మీరూ ఉండే ఖ‌చ్చితంగా కొన్ని జాగ్ర‌త్త‌లను తీసుకోవాల్సి ఉంటుంది.మ‌రి ఆ జాగ్ర‌త్త‌లు ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

సాధార‌ణంగా కొంద‌రు భోజ‌నం చేసిన వెంట‌నే నీరు తాగేస్తూ ఉంటారు.ఇలా చేయ‌డం వ‌ల్లా గ్యాస్ వ‌స్తుంటుంది.

కాబ‌ట్టి, భోజ‌నం చేసిన అర గంట వ‌ర‌కు నీటిని తీసుకోరాదు.అలాగే వ్యాయామం ద్వారా గ్యాస్ ట్ర‌బుల్‌కు దూరంగా ఉండొచ్చు.

అవును, ప్ర‌తి రోజు క‌నీసం ఇర‌వై నిమిషాల పాటు వ్యాయామాలు చేస్తే.జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగు ప‌డుతుంది.

దాంతో గ్యాస్ ద‌రి చేర‌కుండా ఉంటుంది. """/" / త‌ర‌చూ గ్యాస్ స‌మ‌స్య ఇబ్బంది పెడుతుంటే ముందుగా కాకుండా మ‌జ్జిగ‌, కొబ్బ‌రి నీరు వంటివి తీసుకోవాలి.

ఇవి గ్యాస్ నుంచి క్ష‌ణాల్లో ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తాయి.మ‌రియు గ్యాస్ వ‌ల్ల వ‌చ్చే మంట‌ను హ‌రిస్తాయి.

కొంద‌రు నిద్రను నిర్ల‌క్ష్యం చేస్తూ ఉంటారు.దాంతో ఒత్తిడి, అల‌స‌ట‌, ఆందోళ‌న వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు ఎక్కువై పోతాయి.

అదే స‌మ‌యంలో జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు సైతం త‌గ్గి పోతుంది.ఫ‌లితంగా గ్యాస్‌, ఎసిడిటీ, అజీర్తి వంటి జీర్ణ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అందుకే కంటి నిండా నిద్ర పోవాలి. """/" / శ‌రీరానికి స‌రిప‌డా ఫైబ‌ర్ అంద‌క‌పోయినా గ్యాస్ స‌మ‌స్య వేధిస్తూ ఉంటుంది.

అందుకే తీసుకునే ఆహారంలో అన్ని పోష‌కాల‌తో పాటు ఫైబ‌ర్ కూడా ఉండేలా జాగ్ర‌త్త తీసుకోవాలి.

సమంతతో నాకు వర్క్ అవుట్ అవ్వలేదు.. నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు!