నేల భూసారం పెంచి, రసాయన వినియోగం తగ్గించే జీవామృతం తయారు చేసుకునే విధానం..!

రైతులు అధిక దిగుబడులు( High Yields ) సాధించడం కోసం రసాయన ఎరువులు, రసాయన పిచికారి మందులు అధిక మోతాదులో ఉపయోగించడం వల్ల పంట నాణ్యత దెబ్బ తినడంతో పాటు నేల క్రమంగా భూసారం కోల్పోతూ వస్తోంది.

అలా కాకుండా దేశీ ఆవుల పేడ, మూత్రాలతో జీవామృతం, ఘన జీవామృతం లాంటి సహజ ఎరువులను వాడితే నాణ్యమైన పంట దిగుబడి పొందడంతో పాటు భూసారం పెంచుకోవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.

"""/" / పంచగవ్యను పిచికారి చేయడం వల్ల పంట ఆరోగ్యకరంగా పెరుగుతుంది.చీడపీడల బెడద( Pest Infestation ) చాలా తక్కువగా ఉంటుంది.

నాటు ఆవుల పేడ, మూత్రాల వాడకం వల్ల రసాయన ఎరువుల వినియోగం చాలావరకు తగ్గించుకోవచ్చు.

స్వల్పకాలిక పంటలకు వారం నుండి 15 రోజులకు ఒకసారి, దీర్ఘకాలిక పంటలకు ప్రతి 15 నుండి నెల రోజులకు ఒకసారి జీవామృతం అందించాలి.

భూమిలో సేంద్రీయ కర్బన శాతాన్ని బట్టి, జీవామృతాన్ని ఉపయోగించాలి. """/" / ఒక ఎకరం పొలానికి 200 లీటర్ల జీవామృతం ఉపయోగించాలి.

అంతేకాదు దీనిని పైపాటుగా మొక్కలపై పిచికారీ కూడా చేయవచ్చు.జీవామృతం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

ఘన జీవామృతం తయారీకి 100 కిలోల నాటు ఆవుల పేడ అవసరం.ఈ ఆవు పేడలో రెండు కిలోల బెల్లం, ఆరు లీటర్ల నిల్వ ఉంచిన ఆవు మూత్రం, రెండు కిలోల పప్పు పిండి కలిపి బాగా కలియబెట్టాలి.

తర్వాత దీనిని ఎండ తగలకుండా నీడ ఉండే ప్రదేశంలో నిల్వ ఉంచాలి.దీనిలో నీరు మొత్తం ఆరిన తర్వాత పిడకలుగా తయారు చేయాలి.

ఈ పిడకలు తయారు చేసిన ఆరు నెలలలోపు ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి.

లేదంటే పశువుల ఎరువుల కుప్పలను పొరలు పొరలుగా విడదీసి బాగా తడిచేటట్లు చల్లని నీడలో ఉంచితే వారం రోజుల్లో ఘన జీవామృతం ( Ghana Jeevamrutham )తయారవుతుంది.

ఈ జీవామృతం తయారైన మూడు నుంచి 6 నెలల కాలవ్యవధిలో పంటకు అందించాలి.

ధనుష్ తో వివాదం.. నేనెందుకు భయపడాలి.. నయన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!