బతుకమ్మకు బాగా ఇష్టమైన మలీద ముద్దుల ఎలా తయూరు చేసుకోవాలో తెలుసా?

తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే బతుకమ్మ పండుగ అంటే అందరికీ ఇష్టమే.

ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులకు ఈ పండుగ చాలా ప్రత్యేకం.పనులన్నీ పక్కన పెట్టేసి పొద్దునే వెళ్లి పూలు తీసుకురావడం, బతుకమ్మ పేర్చడం, నైవేద్యం తయారు చేయడం, ఆ తర్వా అందంగా ముస్తాబై వెళ్లి బతుకమ్మలు ఆడుకోవడం, నిమజ్జనం చేయడం ఇదే హడావుడి.

అయితే సద్దుల బతుకమ్మ రోజు చేసే మలీద ముద్దల ప్రసాదం అయితే చాలా ఫేమస్.

ఈ ప్రసాదం ఒక్క తెలంగాణలోనే చేస్తుంటారు.చాలా మందికి ఈ వంటకం గురించి తెలియదు.

అయితే బతుకమ్మకు బాగా ఇష్టమైన ఈ మలీద ముద్దలు ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

H3 Class=subheader-styleకావాల్సిన పదార్థాలు./h3p గోధుమ పిండి, బొంబాయి రవ్వ, అరకప్పు పాలు, గుప్పెడు నట్స్, రుచికి సరిపడా ఉప్పు, కప్పు బెల్లం తురుము, అర టీ స్పూన్ సోంపు పొడి, టీ స్పూన్ యాలకుల పొడి.

"""/"/ H3 Class=subheader-styleతయారీ విధానం./h3p ముందుగా గోధుమ పిండిని, రవ్వను ఒక గిన్నెలో వేసుకొని బాగా కలపాలి, అందులో నెయ్యిని కాచి వేయాలి.

ఈ మిశ్రమాన్ని కూడా బాగా కలపాలి, ఆ తర్వాత పాలు వేసి బాగా కలిపి, చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.

ఓ పావు గంట తర్వాత మీడియం సైజుల్లో ఉండగా చుట్టుకని చపాతీల్లా ఒత్తుకొని కాల్చాలి.

ఓ కళాయిిలో నెయ్యి వేసి జీడిపప్పు, బాదాం, పిస్తాలు సన్నగా తరిగి వేయించుకోవాలి.

వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక గిన్నెలో చపాతీని తీస్కొని చిన్న ముక్కులుగా చేస్కోవాలి.

వీటిలో బెల్లం తరుగు వేసి కాచిన నెయ్యి, ముందుగా వేయించుకున్న నట్స్ తరుగును, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.

అనంతరం ముద్దులు కట్టుకోవాలి.అంతే ఎంతో రుచికరమైన మలీద లడ్డూలు రెడీ.

ప్రస్తుతం స్టార్ హీరోలకు ధీటుగా ఉన్న స్నేహితుడు ఆర్టిస్ట్.. ఈ నటుడిని గుర్తు పట్టారా?