పితృదేవతల ఋణం ఎలా తీర్చుకోవాలో తెలుసా..?

మనిషి తన జీవితంలో ఈ మూడు రకాల ఋణాలను కచ్చితంగా తీర్చుకోవాలని పండితులు చెబుతున్నారు.

దేవతల ఋణం, ఋషుల ఋణం,అలాగే పితృ ఋణం( Pitru Tarpan ).వీటిలో పితృ ఋణన్ని తీర్చడానికి ఉద్దేశించిన కాలమే పితృపక్షం బాద్రపద కృష్ణ పక్ష పాడ్యమి నుంచి మహాలయ అమావాస్య వరకు ఉన్న 15 రోజులను పితృపక్షంగా పిలుస్తూ ఉంటారు.

ఈ 15 రోజులు పెద్దలకు ఇష్టమైనవి.ఈ సంవత్సరం మహాలయ పక్షాలు సెప్టెంబర్ 29 నుంచి మొదలవుతాయి.

అలాగే అక్టోబర్ 14వ తేదీ వరకు ఉంటాయి.ఈ 15 రోజులపాటు పితృ కార్యాలు నిర్వహిస్తారు.

ఈ సమయంలో పితృదేవతలకు తర్పణాలు వదలాలని పండితులు చెబుతున్నారు. """/" / కాబట్టి ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు.

హిందువుల నమ్మకం ప్రకారం అరచేతిలో బొటనవేలో ఉన్న భాగాన్ని పితృతీర్థం( Pitru Theertham ) అని అంటారు.

తర్పణ పదార్థాలను తీసుకున్న తర్వాత దక్షిణ దిశలో కూర్చోవాలి.పూర్వికులకు బొటన వేలి నుంచి నిటిని తర్పణం వదిలాలి.

ఇలా పూర్వీకులకు సమర్పిస్తే వారి ఆత్మ శాంతిస్తుందని పండితులు చెబుతున్నారు.పౌరాణిక గ్రంధాల ప్రకారం బొటనవేలు ఉన్నా అరచేతి భాగాన్ని పితృతీర్థం అని అంటారు.

కర్తలు తమ చేతులలో నీరు, కుశ, అక్షత పూజలు మరియు నల్ల నువ్వులు( Black Sesame Seeds ) తీసుకోవాలి.

పూర్వీకులను ధ్యానం చేసుకుంటూ దాహం తీర్చుకోండి అంటూ నీటిని వదలాలి.తూర్పుముఖంగా పూర్వీకులకు నైవేద్యాలను సమర్పించాలి.

"""/" / రుషి తీర్థంలో ఉత్తర ముఖంగా పూర్వికులకు నీరు మరియు అక్షతలను సమర్పించాలి.

పూర్వీకులకు దక్షిణముఖంగా నీరు, నువ్వులు సమర్పించాలి.అంతేకాకుండా కొంతమంది పితృపక్షం( Pitru Paksha ) పూర్వీకులకు అత్యంత ముఖ్యమైన రోజులని పండితులు చెబుతున్నారు.

మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలంటే మహాలయ పక్షాలలో తర్పణాలు విడవాలని పండితులు చెబుతున్నారు.

అయితే ఇంట్లో గంగాజలం( Ganga Jalam ) ఉంటే దానితో తర్పణాలు వదిలితే చాలా పవిత్రత ఉంటుందని చెబుతున్నారు.

ఎందుకంటే సనాతన ధర్మంలో గంగా నదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.పూర్వీకులకు సమర్పించేలా గంగాజలంలో ఆహారం కలిపి నైవేద్యంగా సమర్పించాలి.

ఇలా చేస్తే పూర్వీకులు ఆశీర్వదిస్తారని చాలామంది ప్రజలు నమ్ముతారు.