భోజనాన్ని ఎలా వడ్డించాలి..? ఎక్కడెక్కడ ఏయే వంటకాలు పెట్టాలి..?
TeluguStop.com
భోజనం వడ్డించడం ఒక కళ.పెద్ద అరిటాకు లేదా విస్తరాకులో భోజనం చేస్తున్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం భోజనం వడ్డించాలి.
అన్నం ఎక్కడ పెట్టాలి, పప్పు, ఇతర కూరలు, చారు, రసం, ఎక్కడ వడ్డించాలో తెలియాలి.
వేపుళ్లు, అప్పడాలు, వడియాలు ఇలా అన్నింటిని ఎక్కడ వడ్డించాలో అక్కడే వడ్డించాలి.కానీ చాలా మందికి భోజనం వడ్డించడం ఎలాగో తెలియదు.
అరిటాకు మధ్యలో అన్నం పెట్టేస్తారు.దాని చుట్టూ కూరలు, వేపుళ్లు, అప్పడాలు వడ్డిస్తారు.
అడిగితే ఉప్పు వేస్తారు.లేదంటే అది కూడా ఉండదు.
చివరికి కొద్దిగా పెరుగు లేదా మజ్జిగ వడ్డిస్తారు అంతటితో భోజనం అయిపోతుంది.భోజనం వడ్డించడాన్ని పరి మార్చడం అంటారు.
అరిటాకు పెద్ద అంచు ఎప్పుడూ కుడి వైపునే వేయాలి.కింద భాగంలో కుడి వైపుకు పప్పు దాని పక్కన అన్నం వడ్డించాలి.
పై భాగంలో కూరలు వేయాలి.కూరలకు ఎడమ వైపున పచ్చడి వేయాలి.
అప్పడాలు ఆపైన వేయాలి.పొడిపొడిగా ఉండే వంటకాలను మొదటగా అరిటాకులో వేయాలి.
ముద్ద ముద్దగా ఉండేవి ఆ తర్వాత వడ్డించాలి.ఉప్పు కావాలని అడిగినా అడగక పోయినా ఒక మూలన తప్పనిసరిగా వేయాలి.
"""/" /
నీళ్ల గ్లాసు లేదా చెంబు ఎడమ చేయి వైపున ఉండకూడదు.
ఎప్పుడైన కుడి చేయికి పక్కన ఉండాలి.గ్లాసులో నీళ్లు అయిపోతే అరిటాకు ముందు పెట్టాలి.
అందులో నీళ్లు పోయగానే మళ్లీ తీసి కుడి చేయి పక్కన పెట్టుకోవాలి.నీళ్లు తాగే సమయంలో ఎడమ చేతితో గ్లాసు లేదా చెంబు పట్టుకుని, మోచేయి కింద కుడి చేయి సపోర్టుగా పెట్టాలి.
అప్పుడు నీటిని తాగాలి.ఇలా పద్ధతిగా భోజనం వడ్డించాలి.
విశ్వంభర సినిమా మీద హైప్ పెంచుతున్న సాంగ్…