స్ట్రెచ్ మార్క్స్ రిమూవల్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా త‌యారు చేసుకోండిలా!

స్ట్రెచ్ మార్క్స్.స్త్రీల‌ను ప్ర‌ధానంగా వేధించే స‌మ‌స్యల్లో ఇది ఒక‌టి.

ముఖ్యంగా ప్ర‌స‌వనంత‌రం శ‌రీరంపై ఎక్క‌డ ప‌డితే అక్క‌డ స్ట్రెచ్ మార్క్స్ ఏర్ప‌డి అస‌హ్యంగా క‌నిపిస్తుంటాయి.

దాంతో వాటిని వ‌దిలించుకునేందుకు మార్కెట్‌లో దొరికే క్రీమ్స్‌, జెల్స్, ఆయిల్స్ ఇలా ఎన్నో వాడుతుంటారు.

అయిన‌ప్ప‌టికీ ఎటువంటి ఫ‌లితం లేకుంటే ఏవేవో ట్రీట్‌మెంట్స్ చేయించుకుంటారు.కానీ, ఎలాంటి ఖ‌ర్చు లేకుండా స్ట్రెచ్ మార్క్స్ రిమూవల్ క్రీమ్‌ను ఇంట్లోనే ఈజీగా త‌యారు చేసుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం స్ట్రెచ్ మార్క్స్‌ను పోగొట్టే క్రీమ్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల వాసెలిన్, వ‌న్ టేబుల్ స్పూన్ అల్లం పౌడ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

చివ‌రిగా వ‌న్ టేబుల్‌ స్పూన్ ఫిష్ ఆయిల్ వేసి మ‌రోసారి క‌లుపుకుంటే స్ట్రెచ్ మార్క్స్ రిమూవల్ క్రీమ్ సిద్ధ‌మైనట్టే.

ఈ క్రీమ్‌ను ఒక డ‌బ్బాలో నింపుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే దాదాపు ప‌ది నుంచి ప‌దిహేను రోజుల పాటు వాడుకోవ‌చ్చు.

స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట గోరు వెచ్చ‌ని నీటితో మొద‌ట‌ వాష్ చేసుకుని త‌డి లేకుండా ఆర బెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత త‌యారు చేసుకున్న క్రీమ్‌ను అప్లై చేసుకుని.గంట పాటు వ‌దిలేయాలి.

"""/"/ ఆపై కూల్ వాట‌ర్‌తో శుభ్రంగా చ‌ర్మాన్ని క్లీన్ చేసుకుని.ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్‌ను రాసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే గ‌నుక స్ట్రెచ్ మార్క్స్ తొల‌గి పోయి చ‌ర్మం మృదువుగా మ‌రియు అందంగా మారుతుంది.

కాబ‌ట్టి, వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టి మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే ప్రోడెక్ట్స్‌ను కొనుగోలు చేసే బ‌దులు.

పైన చెప్పిన విధంగా ఇంట్లోనే స్ట్రెచ్ మార్క్స్ రిమూవల్ క్రీమ్‌ను త‌యారు చేసుకుని వాడండి.

కొత్త కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి లహరి.. కారు ఖరీదు తెలిస్తే వామ్మో అనాల్సిందే!