స్కిన్ టైట్‌నింగ్ ఆయిల్.. రోజూ రాస్తే యవ్వనంగా మెరిసిపోతారు!
TeluguStop.com
వయసు పైబడే కొద్ది చర్మంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి.ముఖ్యంగా నలబై ఏళ్లు దాటాయంటే చర్మంలో ఉండే కండరాల పటుత్వం తగ్గిపోతుంది.
దాంతో స్కిన్ కొంచెం కొంచెంగా సాగిపోతూ ఉంటుంది.ఫలితంగా చర్మంపై ముడతలు, చారలు ఏర్పడుతుంటాయి.
ఇవి మానసికంగా ఎంతగానో కృంగదీస్తాయి.అందుకే వయసు పెరుగుతున్నాయవ్వనంగానే కనిపించాలని తెగ ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే స్కిన్ టైట్‌నింగ్ ఆయిల్ సూపర్‌గా హెల్ప్ చేస్తుంది.
ఆ ఆయిల్‌ను రోజూ రాసుకుంటే ఎన్నో స్కిన్ కేర్ బెనిఫిట్స్‌ను తమ సొంతం చేసుకోవచ్చు.
మరి ఆ ఆయిల్‌ను ఎలా తయారు చేసుకోవాలి.? ఏ విధంగా వాడాలి వంటి విషయాలపై లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కప్పు ఆలివ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల కొకొనట్ ఆయిల్ వేసి కలపాలి.
బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ ఇన్‌స్టెంట్ గ్రీన్ టీ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు మరో బౌల్ తీసుకుని అందులో బాగా మరిగిచిన వాటర్ పోయాలి.ఈ వాటర్‌లో ఇన్‌గ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న బౌల్‌ను పెట్టి పదిహేను నిమిషాల పాటు వదిలేయాలి.
ఆపై నూనెను మాత్రం సపరేట్ చేసుకుని బాటిల్‌లో నింపుకుంటే స్కిన్ టైట్‌నింగ్ ఆయిల్ సిద్ధమైనట్టే.
"""/"/
ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు ముఖాన్ని, మెడను వాటర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఆ తర్వాత తయారు చేసుకున్న ఆయిల్‌ను అప్లై చేసి రెండు, మూడు నిమిషాల పాటు మసాజ్ చేసుకుని పడుకోవాలి.
ఇలా చేస్తే గనుక సాగిన చర్మం మళ్లీ టైట్‌గా మారుతుంది.ముడతలు, చారలు తొలగిపోతాయి.
మరియు చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మారుతుంది.
గొంతు నొప్పి వేధిస్తుందా.. మందులతో అవసరం లేకుండా ఇలా చెక్ పెట్టండి!