ముఖంపై ఎటువంటి మ‌చ్చ‌లు ఉండ‌కూడ‌దా? అయితే ఈ క్రీమ్ మీకే!

ఎటువంటి మ‌చ్చ‌లు లేకుండా ముఖం అందంగా, కాంతివంతంగా మెరిసిపోవాలని అంద‌రూ కోరుకుంటారు.అయితే అందుకోసం ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ ఏదో ఒక కార‌ణం చేత మ‌చ్చ‌లు ఏర్ప‌డుతూనే ఉంటాయి.

చ‌ర్మం ఎంత తెల్ల‌గా ఉన్నా.అక్క‌డ‌క్క‌డ క‌నిపించే మ‌చ్చ‌లు ముఖ సౌంద‌ర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.

దాంతో ఆ మ‌చ్చ‌ల‌ను వ‌దిలించుకోవ‌డం కోసం మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే ర‌క‌ర‌కాల క్రీమ్స్‌, జెల్స్‌, సీర‌మ్స్ ను కొనుగోలు చేసి వాడుతుంటారు.

అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుంటే ఏం చేయాలో తెలియ‌క తెగ మ‌ద‌న ప‌డుతూ ఉంటారు.

ఆ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే మీరు ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ క్రీమ్‌ను వాడాల్సిందే.

ఎటువంటి మ‌చ్చ‌ల‌నైనా పోగొట్టి ముఖాన్ని అందంగా మార్చే సామ‌ర్థ్యం ఆ క్రీమ్‌కు ఉంది.

మ‌రి లేటెందుకు ఆ క్రీమ్ ను ఎలా త‌యారు చేసుకోవాలో చూసేయండి.ముందుగా ఒక క‌ప్పు బియ్యం క‌డిగిన నీటిని తీసుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి.

అలాగే ఒక క‌ట్ట పార్స్‌లీ ఆకులు తీసుకుని వాట‌ర్‌లో శుభ్రంగా క‌డిగి క‌ట్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత‌ బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న పార్స్‌లీ ఆకులు, బియ్యం క‌డిగి నీరు వేసుకుని గ్రైండ్ చేసుకుని జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక మంద‌పాటి గిన్నెలో పార్స్‌లీ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి.

ఆపై క్రీమి స్ట్రక్చర్ వ‌చ్చే వ‌ర‌కు స్లో ఫ్లేమ్ పై ఉడికించి చ‌ల్లార‌బెట్టుకోవాలి.

"""/" / పూర్తిగా కూల్ అయ్యాక అందులో రెండు టేబుల్ స్పూన్ల ఫ్లెక్స్ సీడ్స్ జెల్‌, హాఫ్ టేబుల్ స్పూన్ విట‌మిన్ ఇ ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకుంటే న్యాచుర‌ల్ పార్స్‌లీ క్రీమ్ సిద్ధం అవుతుంది.

ఈ క్రీమ్‌ను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వారం రోజుల పాటు వాడుకోవ‌చ్చు.నైట్ నిద్రించే ముందు ఒక‌సారి వాట‌ర్‌తో ఫేస్ వాష్ చేసుకుని ఆపై పార్స్‌లీ క్రీమ్ ను రాసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే చ‌ర్మంపై ఏర్ప‌డిన మ‌చ్చ‌లు క్ర‌మంగా త‌గ్గిపోతాయి క్లియ‌ర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

బిగ్ బాస్ లో కూడా కమిట్మెంట్స్ ఇవ్వాల్సిందేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన హిమజ!