పార్లర్ కి వెళ్ళకుండా ఇంట్లోనే ఫేషియల్ బ్లీచ్ చేసుకోవడం ఎలానో తెలుసా?
TeluguStop.com
ముఖ చర్మాన్ని తెల్లగా మార్చుకునేందుకు దాదాపు అందరూ పార్లర్‌కి వెళ్లి బ్లీచ్ చేయించుకుంటారు.
బ్లీచింగ్ వలన తక్కువ సమయంలోనే చర్మం వైట్‌గా, బ్రైట్‌గా మెరిసి పోతుంది.అయితే బ్లీచింగ్ చేయించుకోవడానికి ప్రతి సారీ బ్యూటీ పార్లర్ వెళ్లి వేలకు వేలు ఖర్చు చేయనక్కర్లేదు.
ఇంట్లోనూ చాలా సులభంగా ఫేషియల్ బ్లీచ్ చేసుకోవచ్చు.పైగా సహజ సిద్ధంగా బ్లీచ్ చేసుకుంటే చర్మానికి ఎటువంటి సమస్యలు ఉండవు.
మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫేషియల్ బ్లీచ్ ఎలా చేసుకోవాలి.? ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల ఆరెంజ్ పీల్ పౌడర్, ఒక స్పూన్ మిల్క్ పౌడర్, మూడు స్పూన్ల కాచిన చల్లార్చిన పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.పది నిమిషాల అనంతరం మెల్ల మెల్లగా రుద్దుకుంటూ ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇలా చేస్తే చర్మంపై మురికి, మృతకణాలు పోయి ఫేస్ గ్లాగా, అందంగా మారుతుంది.
అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ బంగాళదుంప రసం, ఒక స్పూన్ శెనగపిండి, చిటికెడు బేకింగ్ సోడా, అర స్పూన్ నిమ్మ రసం, కొద్దిగా వైట్ టూత్ పేస్ట్ వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసి.ఐదు నిమిషాల తర్వాత కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
ఈ న్యాచురల్ బ్లీచ్ వల్ల చర్మం తెల్లగా మారుతుంది. """/"/
ఇక ఒక గిన్నె తీసుకుని అందులో ఒక స్పూన్ చందనం పొడి, చిటికెడు పసుపు, ఒక స్పూన్ పుల్లటి పెరుగు, ఒక స్పూన్ నిమ్మ రసం, అర స్పూన్ తేనె మరియు అర స్పూన్ లెమెన్ పీల్ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూసి ఇరవై నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి.
ఈ ప్యాక్ కూడా ఒక న్యాచురల్ బ్లీచ్‌లా పని చేస్తుంది.
అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ .. అమెరికాను వీడనున్న సెలబ్రెటీలు , ఎవరెవరంటే?