తెల్ల జుట్టుతో ఇక నో వర్రీ.. ఇంట్లోనే హెన్నా తయారు చేసుకోండిలా!

ప్రస్తుత రోజుల్లో తెల్ల జుట్టు( White Hair ) అనేది చాలా మందిని వేధిస్తున్న కామన్ సమస్య.

వయసు పైబడిన వారిలోనే కాదు మంచి వయసులో ఉన్నవారు సైతం తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు.

ఇందుకు కారణాలు అనేకం ఉన్నప్పటికీ.అందరూ ఎంచుకునే పరిష్కారం హెన్నా.

మార్కెట్లో లభ్యమయ్యే హెన్నా ను తెచ్చుకుని తెల్ల జుట్టును కవర్ చేసుకుంటూ ఉంటారు.

అయితే మార్కెట్లో దొరికే హన్నా వల్ల కొందరికి తలనొప్పి మరియు ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి.

అందుకే ఇంట్లోనే ఈజీగా హెన్నా ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / ముందుగా నాలుగు కప్పులు గోరింటాకును తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్ పై ఎండలో ఎండబెట్టుకోవాలి.

అలాగే పది మందారం పూలు, ఐదు మందారం ఆకులు మరియు ఐదు రెబ్బలు వేపాకు కూడా తీసుకుని శుభ్రం చేసుకుని ఎండలో పెట్టుకోవాలి.

కంప్లీట్ గా డ్రై అయ్యాక మిక్సీ జార్ లో అన్నిటిని కలిపి పొడి లా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ పొడిని జల్లెడ పడితే మన న్యాచురల్ హెన్నా సిద్ధం అవుతుంది.ఇంట్లో తయారు చేసిన ఈ హెన్నా ను వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

ఈ హెన్నా పొడిని ఒక గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకుంటే దాదాపు ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది.

ఇక ఈ హెన్నా పౌడర్ ను ఎలా వాడాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మీ జుట్టుకు సరిపడా హెన్నా పౌడర్ వేసుకోవాలి.

ఇందులో సరిపడా టీ డికాక్ష‌న్ లేదా కాఫీ డికాక్ష‌న్ లేదా మెంతులు మరిగించిన వాటర్ లేదా నార్మల్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసి గంట పాటు పక్కన పెట్టుకోవాలి.

"""/" / ఆపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.15 రోజులకు ఒకసారి ఇలా చేస్తే తెల్ల జుట్టుతో వ‌ర్రీ అక్కర్లేదు.

ఇంట్లో తయారు చేసిన ఈ హెన్నా పౌడర్( Henna Powder ) తెల్ల‌ జుట్టును న‌ల్ల‌గానే కాకుండా ఆరోగ్యంగా కూడా మారుస్తుంది.

వీడియో: పూటుగా తాగిన వరుడు.. వధువు అనుకుని మరదలు మెడలో మాల వేశాడు..??