స్కిన్ టోన్‌ను పెంచే వెల్లుల్లి ఫేస్ క్రీమ్‌.. ఇంట్లోనే చేసుకోండిలా!

స్కిన్ టోన్‌ను పెంచుకోవ‌డం కోసం చాలా మంది ఖ‌రీదైన క్రీముల‌ను వాడుతూ వేల‌కు వేల‌కు ఖ‌ర్చు పెడుతుంటారు.

కానీ, ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఇంట్లో ఉండే వెల్లుల్లితో కూడా చ‌ర్మ ఛాయ‌ను మెరుగుప‌రుచుకోవ‌చ్చు.

ముఖ్యంగా వెల్లుల్లితో ఫేస్ క్రీమ్‌ను త‌యారు చేసుకుని రోజూ వాడితే స్కిన్ టోన్ పెర‌గ‌డ‌మే కాదు.

మ‌రెన్నో చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను సైతం నివారించుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం వెల్లుల్లితో ఇంట్లోనే ఫేస్ క్రీమ్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో చూసేయండి.

ప‌ది వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసుకుని శుభ్రంగా పొట్టును తొల‌గించాలి.ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో పొట్టు తీసి పెట్టుకున్న‌ వెల్లుల్లి రెబ్బ‌ల‌ను వేసి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించి చ‌ల్లార‌బెట్టుకోవాలి.

ఇప్పుడు బ్లెండ‌ర్‌లో వాట‌ర్‌తో స‌హా వెల్లిల్లి రెబ్బ‌ల‌ను వేసి గ్రౌండ్ చేసుకుని.జ్యూస్‌ను మాత్రం స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత మ‌ళ్లీ స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో వెల్లిల్లి జ్యూస్‌, వ‌న్ టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకుంటూ స్లో ఫ్లేమ్‌పై ఉడికించాలి.

ఆరేడు నిమిషాల‌కు అది క్రీమీగా మారుతుంది.అప్పుడు స్ట‌వ్ ఆఫ్ చేసి ఉడికించిన మిశ్ర‌మాన్ని కూల్‌గా మార్చుకోవాలి.

ఆపై అందులో వ‌న్ టేబుల్ స్పూన్ ప్యూర్ అలోవెర జెల్‌, హాఫ్ టేబుల్ స్పూన్ విట‌మిన్ ఇ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకుంటే క్రీమ్ సిద్ధ‌మైన‌ట్టే.

"""/"/ ఈ క్రీమ్‌ను ఒక బాక్స్‌లో నింపుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే దాదాపు ప‌ది రోజుల పాటు వాడుకోవ‌చ్చు.

రాత్రి నిద్రించే ముందు ఈ క్రీమ్‌ను ముఖానికి అప్లై చేసుకోవాలి.రోజూ దీనిని యూజ్ చేస్తే గనుక స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.

ముఖంపై డార్క్ స్పాట్స్ తొల‌గిపోతాయి.డ్రై స్కిన్ నుంచి విముక్తి ల‌భిస్తుంది.

మ‌రియు మొటిమ‌లు సైతం త్వ‌ర‌గా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

గేమ్ చేంజర్ కలెక్షన్స్ చూస్తే మతి పోతుంది…