అరటిపండు తొక్కే కదా అని పారేయకండి.. దానితో ఇలా ఫేస్ క్రీమ్ చేసుకుని వాడితే ఊహించని లాభాలు మీ సొంతం!

అరటి పండు( Banana ) తిని తొక్క పారేయడం అందరికీ అలవాటే.తొక్కలోది తొక్క వల్ల ప్రయోజనం ఏంటి అని చాలామంది భావిస్తుంటారు.

కానీ అరటి పండులోనే కాదు తొక్కలోనూ ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.

ముఖ్యంగా అరటి పండు తొక్క అందాన్ని పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది.అరటి పండు తొక్కతో ఇప్పుడు చెప్పబోయే విధంగా ఫేస్ క్రీమ్ తయారు చేసుకుని వాడితే ఊహించని లాభాలు మీ సొంతం అవుతాయి.

ఇంకెందుకు ఆలస్యం అరటిపండు తొక్కతో ఎలా ఫేస్ క్రీమ్( Face Cream ) తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం పదండి.

ముందుగా రెండు అరటి పండు తొక్కలను తీసుకుని వాటర్ తో ఒకసారి వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న అరటి పండు తొక్కలు( Banana Peel ) వేసి కనీసం ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన అరటిపండు తొక్కల‌ను వాటర్ తో సహా మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్మూత్ ప్యూరీని స్టైనర్ సహాయంతో సపరేట్ చేసుకోవాలి.

"""/" / ఈ ప్యూరీలో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloevera Gel ) నాలుగు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ వెజిటేబుల్ గ్లిజరిన్, నాలుగు చుక్కలు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

దాంతో మ‌న‌ క్రీమ్ సిద్ధమవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

ప్రతిరోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొలగించి వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

"""/" / ఆపై త‌యారు చేసుకున్న బనానా పీల్ క్రీమ్ ను( Banana Peel Cream ) అప్లై చేసుకోవాలి.

రోజు నైట్ ఈ క్రీమ్ ను కనుక వాడితే చర్మం టైట్ గా మారుతుంది.

ముడతలు మాయం అవుతాయి.మొండి మచ్చలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.

ముఖ చర్మం కాంతివంతంగా మరియు ఆకర్షణీయంగా మారుతుంది.వయసు పైబడిన సరే యవ్వనంగా మెరిసిపోతూ కనిపిస్తారు.

మరియు ఈ బనానా పీల్ క్రీమ్ మీ ముఖ చర్మాన్ని మృదువుగా కోమలంగా సైతం మారుస్తుంది.

థియేటర్ లో మహేష్ మురారి మూవీ చూస్తూ పెళ్లి చేసుకున్న జంట.. ఏం జరిగిందంటే?