డార్క్ స్పాట్స్ రిమూవల్ క్రీమ్‌ను ఇంట్లోనే ఈజీగా త‌యారు చేసుకోండిలా!

డార్క్ స్పాట్స్‌.స్త్రీల‌నే కాదు పురుషుల‌నూ వేధించే కామ‌న్ చ‌ర్మ స‌మ‌స్య ఇది.

ఎంత అంద‌మైన చ‌ర్మాన్ని అయినా డార్క్ స్పాట్స్ అందవిహీనంగా మార్చేస్తాయి.అందుకే వీటిని వ‌దిలించుకోవ‌డం కోసం మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే ర‌క‌ర‌కాల క్రీమ్స్‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు.

కానీ, వీటి వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు మాత్రం చాలా త‌క్కువ‌గా ఉంటాయి.అయితే ఇంట్లోనే ఇప్పుడు చెప్పబోయే విధంగా డార్క్ స్పాట్స్ రిమూవ‌ల్ క్రీమ్‌ను త‌యారు చేసుకుని యూజ్ చేస్తే నెల రోజుల్లోనే మీ చ‌ర్మంపై ఏర్ప‌డిన మ‌చ్చ‌లు క్ర‌మంగా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

ఇంకెందుకు లేటు ఆ న్యాచుర‌ల్ క్రీమ్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ప‌ది నుంచి ప‌దిహేను వాల్‌న‌ట్స్, క‌ప్పు వాట‌ర్ వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఈ పేస్ట్ నుంచి జ్యూస్‌ను మాత్రం స‌ప‌రేట్ చేసుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వాల్‌న‌ట్స్ జ్యూస్‌, వ‌న్ టేబుల్ స్పూన్ హ‌నీ, వ‌న్ టేబుల్ స్పూన్ గ్లిజ‌రిన్‌, హాఫ్‌ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి ఒక‌సారి క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత‌ అందులో మూడు టేబుల్ స్పూన్ల ప్యూర్ అలోవెర జెల్‌ను కూడా యాడ్ చేసి అన్నీ క‌లిసేలా మిక్స్ చేసుకుంటే డార్క్ స్పాట్స్ రిమూవల్ క్రీమ్ సిద్ధ‌మైన‌ట్టే.

దీనిని ఒక బాక్స్‌లో నింపుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే రెండు వారాలు పాటు వాడుకోవ‌చ్చు.

"""/" / ఇక ఈ క్రీమ్‌ను ఎలా యూజ్ చేయాలంటే.నైట్ నిద్ర‌పోయే ముందు ముఖానికి ఏమైనా మేక‌ప్ ఉంటే పూర్తిగా తొల‌గించి వాట‌ర్‌తో వాష్ చేసుకోవాలి.

ఆపై త‌యారు చేసుకున్న‌ క్రీమ్‌ను మ‌చ్చ‌లు ఉన్న చోటే కాకుండా ముఖం మొత్తానికి అప్లై చేసుకుని ప‌డుకోవాలి.

ఇలా రోజు చేస్తే డార్క్ స్పాట్స్ క్ర‌మంగా త‌గ్గిపోతాయి.మ‌రియు స్కిన్ వైట్‌గా, బ్రైట్‌గా కూడా మారుతుంది.

ఏనుగుకు గ్రాండ్‌గా బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. ఇదెలా డ్యాన్స్ చేసిందో చూస్తే ఫిదా..??