వ్యాయామం త‌ర్వాత తాగాల్సిన బెస్ట్ న్యాచుర‌ల్‌ ప్రోటీన్ షేక్స్ ఇవే!

ఈ మ‌ధ్య కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా అంద‌రూ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు రెగ్యుల‌ర్‌గా వ్యాయామాలు చేస్తున్నారు.

అయితే చాలా మందికి వ్యాయామాలు చేసిన అనంత‌రం ప్రోటీన్ షేక్ తీసుకునే అల‌వాటు ఉంటుంది.

ఈ నేప‌థ్యంలో మార్కెట్‌లో ల‌భించే బెస్ట్ ప్రోటీన్ పౌడ‌ర్స్‌ను ఎంతో ఖ‌ర్చు పెట్టి కొనుగోలు చేస్తుంటారు.

కానీ, వీటి కంటే ఇంట్లో త‌యారు చేసుకునే న్యాచుర‌ల్ ప్రోటీన్ షేక్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

మ‌రి ఆ న్యాచుర‌ల్ ప్రోటీన్ షేక్స్ ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

మొద‌టిది అర‌టి పండు, డార్క్ చాక్లెట్‌, పీన‌ట్ బ‌ట‌ర్ మ‌రియు పాల‌తో చేసేది.

ఇందుకు ముందు ఒక అర‌టి పండు తీసుకుని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి ఒక బౌల్‌లో వేసుకుని అందులో ఒక స్పూన్ చ‌ప్పున పీన‌ట్ బ‌ట‌ర్‌, క‌రిగిన డార్క్ చాక్లెట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఇందులో పాలు క‌లిపి వ్యాయామాలు అయిన త‌ర్వాత తాగితే శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తి ల‌భించ‌డంతో పాటు అనేక పోష‌క విలువ‌లు అందుతాయి.

"""/" / రెండొవ‌ది ముందుగా ఒక‌టి లేదా రెండు కివి పండ్ల‌ను ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఇప్పుడు జార్‌లో ఒక గ్లాస్ పాలు, క‌ట్ చేసుకున్న కివి పండ్ల ముక్క‌లు మ‌రియు ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజ‌ల పొడి వేసి బాగా క‌లుపుకోవాలి.

ఈ ప్రోటీన్ షేక్‌ను వ్యాయామం త‌ర్వాత తీసుకుంటే ఎన‌ర్జిటిక్‌గా మార‌డంతో పాటు అతి ఆక‌లి త‌గ్గు ముఖం ప‌డుతుంది.

బ‌రువు కూడా క్ర‌మంగా త‌గ్గుతారు.ఇక మూడొవ‌ది బౌల్‌లో తీసుకుని అందులో ఒక క‌ప్పు బాదం పాలు, అర క‌ప్పు స్ట్రాబెరీ ముక్క‌లు మ‌రియు అర స్పూన్ స‌బ్జా విత్త‌నాలు వేసి బాగా క‌లిపి ప‌క్క‌న పెట్టుకోవాలి.

వ‌ర్కౌట్లు చేసిన త‌ర్వాత ఈ ప్రోటీన్ షేక్ తీసుకుంటే.అల‌సిపోయిన మీ శ‌రీరం మ‌ళ్లీ యాక్టివ్ మోడ్‌లోకి వ‌చ్చేస్తుంది.

వ‌ర్కౌట్స్ చేయ‌డం వ‌ల్ల వ‌చ్చే కండరాల నొప్పులు కూడా దూరం అవుతాయి.

ఓటమిని అంగీకరిస్తున్నా.. నా పోరాటం ఆగదు, ట్రంప్‌కు శుభాకాంక్షలు : కమలా హారిస్