అవ‌కాడో ఫేస్ క్రీమ్‌.. రోజు వాడితే మ‌స్తు ప్ర‌యోజ‌నాలు!

అవ‌కాడో.ప్ర‌కృతి ప్ర‌సాదించిన అద్భుత‌మైన పండు ఇది.

కాల్షియం, ఐర‌న్‌, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్‌, విట‌మిన్ సి, విట‌మిన్ ఎ, విట‌మిన్ ఇ, విట‌మిక్ కె, రైబోఫ్లేవిన్, ఫోలేట్, ప్రోటీన్‌, ఫైబ‌ర్ ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు అవ‌కాడోలో నిండి ఉంటాయి.

అందుకే ఈ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది.చ‌ర్మ సౌంద‌ర్యానికీ ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.

ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా అవ‌కాడో పండుతో ఫేస్ క్రీమ్ త‌యారు చేసుకుని ప్ర‌తి రోజు వాడితే మ‌స్తు ప్ర‌యోజనాలు పొందొచ్చు.

మ‌రి లేటెందుకు అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.ముందుగా వాట‌ర్‌లో క‌డిగిన ఒక అవ‌కాడో పండు తీసుకుని లోప‌లి గింజ‌ను తొల‌గించి.

ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఈ ముక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పేస్ట్ చేయాలి.

ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బ‌రి నూనె పోయాలి.

నూనె హీట్ అవ్వ‌గానే అందులో అవ‌కాడో పండు పేస్ట్ వేసి స్లో ఫ్లేమ్‌పై ఐదారు నిమిషాల పాటు వేయించుకోవాలి.

ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆఫ్ చేసి అవ‌కాడో మిశ్ర‌మాన్ని చ‌ల్లార బెట్టుకుని.ఆయిల్‌ను మాత్రం ఫిల్ట‌ర్ చేసుకోవాలి.

ఇప్పుడు మ‌రో బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్‌, ముందుగా త‌యారు చేసి పెట్టుకున్న‌ అవ‌కాడో ఆయిల్ వేసి ఐదు నుంచి ప‌ది నిమిషాలు బాగా మిక్స్ చేసుకుంటే అవ‌కాడో ఫేస్ క్రీమ్‌ సిద్ధ‌మైన‌ట్టే.

"""/" / ప్ర‌తి రోజు ఈ న్యాచుర‌ల్ క్రీమ్‌ను ముఖానికి వాడ‌టం వ‌ల్ల స్కిన్ టోన్ మెరుగు ప‌డుతుంది.

మొటిమ‌ల వ‌ల్ల ఏర్ప‌డిన న‌ల్ల మ‌చ్చ‌లు క్ర‌మంగా త‌గ్గిపోతాయి.చ‌ర్మంపై ముడ‌త‌లు, స‌న్న‌ని చార‌లు ప‌డ‌కుండా ఉంటాయి.

మ‌రియు ముఖం ఎల్ల‌ప్పుడూ కాంతి వంతంగా మెరిసిపోతుంది.కాబ‌ట్టి, ఖ‌చ్చితంగా ఈ క్రీమ్‌ను ట్రై చేయండి.

GATE First Ranker Sai Kiran : యూట్యూబ్ వీడియోల ప్రిపరేషన్ తో గేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన సాయికిరణ్.. ఇతని సక్సెస్ కు గ్రేట్ అనాల్సిందే!