పొట్ట కొవ్వుతో దిగులెందుకు.. కొత్తిమీరతో ఇలా కరిగించుకోండి!

ఇటీవల కాలంలో స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా చాలా మందిని మదన పెడుతున్న సమస్య బెల్లీ ఫ్యాట్( Belly Fat ).

పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోవడం వల్ల అందంగా, నాజూగ్గా ఉండాల్సిన వారు మందంగా మారుతున్నారు.

దీంతో ఇరుగుపొరుగు వారే కాదు ఇంట్లో వాళ్ళు కూడా బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తుంటారు.

ఈ క్రమంలోనే పొట్ట కొవ్వు ను కరిగించుకునేందుకు తోచిన ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు.

మీరు కూడా పొట్ట కొవ్వును కరిగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారా.? అయితే దిగులొద్దు మీకు కొత్తిమీర చాలా బాగా హెల్ప్ చేస్తుంది.

పొట్ట కొవ్వును కరిగించడానికి కొత్తిమీర సూపర్ ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. """/"/ మరి ఇంతకీ కొత్తిమీర( Coriander )ను ఎలా తీసుకుంటే పొట్ట కొవ్వు కరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక కప్పు ఫ్రెష్ కొత్తిమీర తీసుకుని వాటర్ లో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.

అలాగే ఒక నిమ్మ పండును తీసుకొని ఉప్పు నీటిలో కడిగి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో కొత్తిమీర మరియు లెమన్ స్లైసెస్( Lemon ) వేసుకుని మరిగించాలి.

ఆల్మోస్ట్ వాటర్ సగం అయ్యేంత వరకు వెయిట్ చేయాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాతే సేవించాలి.

"""/"/ రోజు ఉదయం ఈ డ్రింక్ ను తీసుకుంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు మొత్తం కొద్ది రోజుల్లోనే కరిగిపోతుంది.

బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.కాబట్టి బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా కొత్తిమీరతో ఈ డ్రింక్ ను తయారు చేసుకుని తీసుకోండి.

పైగా ఈ డ్రింక్ వెయిట్ లాస్ కు కూడా గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.

వైరల్: పెద్ద సమస్యను పరిష్కరించిన గేద.. ఎలా అంటే..