రైల్వే HRMSలోకి లాగిన్ అవ్వడం ఎలా..? పూర్తి ప్రాసెస్ ఇదే..

రైల్వేశాఖలో( Railway Department ) లక్షలమంది ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు.ఎక్కువమంది ఉద్యోగులు పనిచేసే కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఇండియన్ రైల్వే అగ్రస్థానంలో ఉంది.

దేశంలోనే విస్తృతమైన రైల్వే నెట్‌వర్క్ ఉంది.అది పొడవైన రైలు మార్గం భారతదేశంలో ఉంది.

దీంతో దేశంలో ప్రజారవాణా వ్యవస్థలో రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.సుమారు 14 లక్షల మంది రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు.

దీనిని బట్టి చేస్తే భారత్ లో రైల్వే వ్యవస్థ ఎంత పెద్దదనేది అర్ధమవతుంది.

"""/" / అయితే రైల్వే ఉద్యోగుల వివరాలు, ఇతర సమాచారం కోసం ఇండియన్ రైల్వే హెచ్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్( HRMS Portal ) ను తీసుకొచ్చింది.

2019 నవంబర్ లో ఈ పోర్టల్ ను తీసుకొచ్చారు.14 లక్షల మంది ఉద్యోగుల వివరాలను పేపర్ ఫార్మాట్ లో మెయింటెన్ చేయడం కష్టం.

అందుకే ఈ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగుల సమాచారం తెలసుకోవచ్చు.ఈ పోర్టల్ ద్వారా రైల్వే ఉద్యోగులు( Railway Employees ) తమ స్వీయ సేవలు, ప్రావిడెంట్ ఫండ్, సేవా వివరాలు, బదిలీలు, సెలవులు మొదలైన వివరాలను తెలసుకోవచ్చు.

ప్రస్తుతం రైల్వేలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఎంప్లాయిస్ కూడా ఈ పోర్టల్ ద్వారా సేవలు పొందవచ్చు.

"""/" / ముందుగా రైల్వే ఉద్యోగులు హెచ్ఆర్‌ఎంఎస్ పోర్టల్ లో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

తొలుత వెబ్ సైట్ లోకి వెళ్లి లాగిన్ మీద క్లిక్ చేయాలి.ఆ తర్వాత పీఎఫ్ నెంబర్ లేదా ఉద్యోగి నెంబర్ ను ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

ఆ తర్వాత పాస్ వర్డ్ ని క్రియేట్ చేసుకోవాలి.ఆ తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది.

ఓటీపీ( OTP ) ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ ఆప్షన్ ఎంచుకోవాలి.ఆ తర్వాత మీరు హెచ్‌ఆర్‌ఎం పోర్టల్ లోకి లాగిన్ అవుతారు.

అలాగే హెచ్‌ఆర్‌ఎం యాప్ కూడా అందుబాటులో ఉంది.ఈ యాప్ ద్వారా కూడా మీరు సేవలు పొందవచ్చు.