మనం వెళ్ళిన హోటల్ రూంలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయో లేవా ఎలా తెలుసుకోవాలంటే..?!
TeluguStop.com
మనుషులు వారి ఉపాధి( Employment ) కోసం రత్రిపగలు ఎంతో కష్టపడి వారికి తగ్గట్టుగా డబ్బు సంపాదన చేస్తుంటారు.
మరికొందరు అడ్డదారులలో డబ్బులు సంపాదించి జీవనం కొనసాగిస్తుంటారు.ఇలా అడ్డదారులు తొక్కేవారు ఎలాంటి ఘోరాలకు అయినా దిగబడతారు.
బయట మనుషుల ప్రాణాలు తీయడం అలాగే వారిని ఇబ్బందులు గురి చేయడం లాంటి పనులు మాత్రమే కాకుండా హోటల్స్ లో సీక్రెట్ కెమెరాలు( Secret Cameras In Hotels ) పెట్టి కూడా వారికి సంబంధించిన పర్సనల్ వీడియోలను కాపీ చేసి వారిని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తారు.
"""/" /
ఎప్పుడైనా మనం వేరే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ బయట హోటల్ గదులలో దిగి మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం.
అయితే కొన్నిసార్లు వారు దిగిన రూములలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయో లేవో తెలియక మోసాలకు గురవుతున్నారు.
కాకపోతే అన్ని హోటల్స్ విషయంలో ఇలా జరగకపోవచ్చు కానీ అక్కడక్కడ ఇలాంటి హోటల్స్ కూడా లేకపోలేవు.
ఒకవేళ మనం ఇలా పరిస్థితి వస్తే మాత్రం కచ్చితంగా హోటల్ గదిలోకి వెళ్లిన వెంటనే ముందుగా ఎక్కడైన రహస్య కెమెరాలు ఉన్నాయో లేదో వాటిని గుర్తించి తర్వాత మన పనులను చేసుకోవాల్సి ఉంటుంది.
ఇకపోతే ఇందుకు సంబంధించి తాజాగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"""/" /
ఇక ఈ వీడియోలో ఓ మహిళ హోటల్ గదికి చేరుకున్న తర్వాత వెంటనే తలుపు తీసి ఆమెతో తెచ్చుకున్న ఓ సీసీ కెమెరా గుర్తించే మిషన్ ( CCTV Camera Detection Mission )ని ఉపయోగించి గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయో చెక్ చేసింది.
ముందుగా గదిలోకి వెళ్లిన తర్వాత అన్ని లైట్లను ఆపివేసి లేజర్ లైట్ తో గదిని స్కాన్ చేయాలని దాని ద్వారా గదిలో రహస్య కెమెరా ఉందో లేదో సులువుగా తెలుసుకోవచ్చంటూ తెలియజేసింది.
ఈమధ్య ఎలక్ట్రానిక్స్ ప్లగ్స్ లో కూడా కెమెరాలను ఉంచే పద్ధతిని చాలామంది ఉపయోగిస్తున్నారు.
కాబట్టి రూమ్ కి వెళ్ళగానే లైట్లు ఆఫ్ చేసి లేజర్ లైట్ తో వాష్ రూమ్ లో అలాగే, ప్లగ్ హోల్డర్స్ లో టీవీకి సంబంధించిన స్పేస్ లో, బాత్రూంలోనే అద్దానికి లైజర్ లైట్ తో చెక్ చేసుకుని రహస్య కెమెరాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవచ్చు.
గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్లపై డైరెక్టర్ ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్లు.. అలాంటి కామెంట్స్ చేస్తూ?