ఈ చిట్కాలు పాటిస్తే..వింట‌ర్‌లో మీ చ‌ర్మానికి ర‌క్ష‌ణ క‌ల్పించిన‌ట్టే!

ఈ చిట్కాలు పాటిస్తేవింట‌ర్‌లో మీ చ‌ర్మానికి ర‌క్ష‌ణ క‌ల్పించిన‌ట్టే!

వింట‌ర్ సీజ‌న్ మొద‌లైందంటే చాలు.ర‌క‌ర‌కాల చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు త‌లుపు త‌డుతూ ఉంటాయి.

ఈ చిట్కాలు పాటిస్తేవింట‌ర్‌లో మీ చ‌ర్మానికి ర‌క్ష‌ణ క‌ల్పించిన‌ట్టే!

వీటి నుంచి త‌ప్పించుకోవ‌డం అంటే క‌త్తి మీద సామే.కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే ఇంటి చిట్కాలను పాటిస్తే గ‌నుక వింట‌ర్ సీజ‌న్‌లో మీ చ‌ర్మానికి ర‌క్ష‌ణ క‌ల్పించిన వార‌వుతారు.

ఈ చిట్కాలు పాటిస్తేవింట‌ర్‌లో మీ చ‌ర్మానికి ర‌క్ష‌ణ క‌ల్పించిన‌ట్టే!

మ‌రి ఆ చిట్కాలు ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.చ‌లి కాలంలో తేమ లేక‌పోవ‌డం వ‌ల్ల చ‌ర్మం తీవ్రంగా పొడి బారి పోతుంటుంది.

ఈ స‌మ‌స్య నుంచి త‌ప్పించుకునేందుకు మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే క్రీములు, మాయిశ్చ‌రైజ‌ర్లు, లోష‌న్ల‌పై ఆధార ప‌డుతుంటారు.

అయితే ఒక స్పూన్ బాదం నూనె, ఒక స్పూన్ కొబ్బ‌రి నూనె, ఒక స్పూన్ అలోవెర జెల్‌, ఒక స్పూన్ షియా వెన్న తీసుకుని బాగా క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని లోష‌న్‌గా చ‌ర్మానికి అప్లై చేసుకోవాలి.త‌ద్వారా స్కిన్ తేమగా, మృదువుగా మ‌రియు కోమ‌లంగా ఉంటుంది.

అలాగే ఈ సీజ‌న్‌లో ముఖంపై ర‌క‌ర‌కాల మ‌చ్చ‌లు ప‌డి అందవిహీనంగా మారిపోతుంటుంది.అయితే ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల ట‌మాటా పేస్ట్, ఒక స్పూన్ గ్రీన్ టీ, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ తేనె వేసుకుని మిక్స్ చేసి ముఖానికి ప‌ట్టించాలి.

ఇర‌వై నిమిషాల అనంత‌రం బాగా రుద్దుకుంటూ ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మ‌చ్చ‌లు, మొటిమ‌లు, ముడ‌త‌లు పోయి ముఖం కాంతివంతంగా పెరుగుతుంది.

వింట‌ర్‌లో కొంద‌రు చ‌ర్మ దుర‌ద‌ల‌ను ఫేస్ చేస్తుంటారు.అలాంటి వారు ఆముదం, ఆలివ్ ఆయిల్ రెండిటినీ స‌మానంగా తీసుకుని బాగా క‌లిపి.

దుర‌ద‌లు ఉన్న చోట మ‌ర్ద‌నా చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే దుర‌ద‌ల స‌మ‌స్యే ఉండ‌దు.

"""/" / ఇక చ‌లి కాలంలో చ‌ర్మం ఆరోగ్యంగా ఉండాలంటే సిట్ర‌స్ పండ్లు, ఆకుకూర‌లు ఎక్కువ‌గా తీసుకోవాలి.

శ‌రీరానికి స‌రిప‌డా నీటిని అందించాలి.వారానికి మూడు సార్లు అయినా స్నానానికి ముందు బాడీ మొత్తానికి వెన్న‌తో మ‌సాజ్ చేసుకోవాలి.

రోజూ వ్యాయామాలు చేయాలి.కూల్ డ్రింక్స్‌, ఐస్ క్రీమ్స్‌, బేక‌రీ ఫుడ్స్‌, పాక్డ్ ఫుడ్స్‌, ఆయిలీ ఫుడ్స్‌ను పూర్తిగా ఎవైడ్ చేయాలి.

హీరో నవదీప్ తో పెళ్లి …. ఫుల్ క్లారిటీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ!