మీ జుట్టు ఎదుగుద‌ల ఆగిపోయిందా? అయితే ఈ టిప్స్ మీకే!

అమ్మాయిల జుట్టు పొడ‌వుగా ఉంటే ఎంత చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.అందుకే జుట్టు పొడుగ్గా పెర‌గాల‌ని కోరుకుంటారు.

అందుకోసం ఖ‌రీదైన ఆయిల్స్, షాంపూస్ కూడా వాడుతుంటారు.అయితే కొంద‌రిలో జుట్టు ఎదుగుద‌ల ఉండ‌దు.

త‌ర‌చూ త‌ల స్నానాలు చేయ‌డం, అధిక వేడి పరికరాల వాడటం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే షాంపూలు యూజ్ చేయ‌డం, మ‌ద్య‌పానం, ధూమ‌పానం, పోష‌కాల లోపం, స‌రైన కేశ సంర‌క్ష‌ణ లేక‌పోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల జుట్టు ఎదుగుద‌ల ఆగిపోతుంది.

దాంతో ఏం చేయాలో తెలియ‌క చాలా మంది తెగ స‌త‌మ‌త‌మ‌వుతుంటారు.అయితే ఈ స‌మ‌స్య‌ను నివారించుకోవాలంటే.

ఖ‌చ్చితంగా కొన్ని టిప్స్ పాలో కావాల్సి ఉంటుంది.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు పొడుగ్గా పెర‌గాలంటే మొద‌ట డైట్‌లో ప‌లు ఆహారాల‌ను చేర్చుకోవాలి.క్యారెట్‌, తృణధాన్యాలు, గుడ్డు, పాలు, సిట్ర‌స్ ఫ్రూట్స్‌, న‌ట్స్‌, పాల‌కూర వంటివి తీసుకుంటే.

జుట్టుకు పోష‌ణ అంది ఎదుగుద‌ల పెరుగుతుంది.అలాగే జుట్టు ఎదుగుద‌ల‌ను పెంచ‌డంలో ఉల్లిపాయ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ముందుగా పీల్ తీసిన ఒక ఉల్లిపాయ‌ను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసి అందులో రెండు స్పూన్ల పెరుగు మ‌రియు కొబ్బ‌రి నూనె వేసి బాగా క‌లిపి.

జుట్టు మొద‌ళ్ల నంచి చివ‌ర్ల‌కు ప‌ట్టించి గంట పాటు వ‌దిలేయాలి.అనంత‌రం త‌ల స్నానం చేయాలి.

ఇలా మూడు రోజుల‌కు ఒక సారి చేస్తే మీ జుట్టు ఎద‌గ‌డం మీరే గ‌మ‌నిస్తారు.

"""/"/ ఇక మ‌ద్య‌పానం, ధూమ‌పానం అల‌వాట్ల‌కు దూరంగా ఉండాలి.ఒత్తిడిని త‌గ్గించుకోవాలి.

కండీషనర్‌ను క‌రెక్ట్ గా వాడాలి.హెయిర్ స్ట్రెయిటెనింగ్, హెయిర్ కర్లర్ వంటి వాటి వ‌ల్ల జుట్టు ఎదుగుద‌ల ఆగిపోతుంది.

కాబ‌ట్టి, వీటికి ఎంత దూరంగా ఉంటే జుట్టుకు అంత మంచిది.మ‌రియు రెగ్యుల‌ర్‌గా త‌ల స్నానం చేసే అల‌వాటును వ‌దులుకోవాలి.

చెన్నై టీమ్ వరుస ఫెయిల్యూర్ కి కారణం ఏంటంటే..?