జీర్ణవ్యవస్థ బాగా ఉండాలంటే ఆయిర్వేదం ప్రకారం ఎలాంటి పద్ధతులు పాటించాలి?

ఆయూర్వేదం ప్రకారం ఏ వస్తువైనా, ఈ అణువైనా, అయితే పంచభూతాల్లో ఒకటి లేదంటే పంచభూతాల కలబోత.

అందులో నిప్పు అనేది జీర్ణవ్యవస్థని నడిపిస్తుందని చెబుతారు.ఈ జీర్ణవ్యవస్థ ఎప్పుడు సాఫీగా పనిచేస్తుందో ఎప్పుడు ఇబ్బందిపెడుతుందో చెప్పలేం.

మనం తీసుకునే డైట్ ని బట్టి, ఒక్కో పూట ఎంత గ్యాప్ ఇచ్చి తింటున్నాం అనేదాన్ని బట్టి, మొత్తంగా మన లైఫ్ స్టయిల్ ని బట్టి ఉంటుంది.

జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోతే కడుపు ఉప్పుతుంది, ఫ్యాట్ పెరుగుతుంది, ఛాతిలో మంట, మెటాబాలిజం రేటు పడిపోతుంది, టాక్సిన్స్ ఎక్కువైపోతాయి, శరీరం ఏ పనికి సహకరించదు.

ఈ ఇబ్బందులు అనే పడేకన్నా, అయూర్వేదం చెప్పిన ఈ క్రింది సూచనలు పాటిస్తూ, జీర్ణవ్యవస్థని మెరుగుపరుచుకోండి.

* మనిషులు నిద్రలేవడానికి ఓ సరైన సమాయాన్ని పాటించరు.కొందరికి ఉదయాన్నే 5-6 గంటల సమయంలో నిద్రలేచే అలవాటు ఉంటే, కొందరు మధ్యాహ్నం అయితే కాని నిద్రలేవరు.

మలాన్ని ఉదయం 4 నుంచి 6 గంటలమధ్యే వదలాలి.పూర్వం ఋషులు కూడా ఇదే పద్ధతిని పాటించేవారు.

ఇదే సరైన సమయం కూడా.అందుకే పక్షులు, పశువులు అన్ని ఉదయాన్నే మలాన్ని బయటకి వదులుతాయి.

మనిషి మాత్రం త్వరగా నిద్రలేవక, సహజ సమయాల్లో కాకుండా మలాన్ని ఆలస్యంగా బయటకి తీస్తాడు.

జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోవడానికి ఇది కూడా ఓ కారణం.అందుకే రాత్రి త్వరగా పడుకోవాలి, ఉదయం త్వరగా లేవాలి.

"""/"/ * చన్నీళ్ళు గొంతులో దిగడానికి బాగుంటాయి.కాని జీర్ణవ్యవస్థకి కావాల్సింది చన్నీళ్ళు కాదు.

గోరువెచ్చని నీళ్ళు.ముందు చెప్పినట్లుగా జీర్ణవ్యవస్థని అగ్నితో ముడిపెట్టారు మన పూర్వీకులు.

తిండి బాగా జీర్ణం కావాలంటే గోరువెచ్చని నీళ్ళే తాగాలని నేటి సైన్స్ కూడా చెబుతోంది.

* సలాడ్స్ తినడం ఈరోజుల్లో పెద్ద ట్రెండ్.కాని ఉడికించని కూరగాయలు, అందులోనూ ఒకేసారి వేరు వేరు ఉడికించని కూరగాయలు తినడం జీర్ణవ్యవస్థ మంచిది కాదని ఆయుర్వేదం చెబుతోంది.

స్టీమ్డ్ ఫుడ్స్ బాగా జీర్ణం అవుతాయి.కాబట్టి అలాంటి ఆహారాలు తినమని చెబుతోంది ఆయుర్వేదం.

Keratin Treatment : ప్ర‌తి నెలా కెరాటిన్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారా.. అయితే మీరు డేంజ‌ర్ లో ప‌డ్డ‌ట్లే!