సీతాఫలంతో అందానికి మెరుగులు.. ఇలా వాడితే మీ చర్మ ఛాయ పెరగడం ఖాయం!
TeluguStop.com
సీతాఫలం( Custard Apple ).చాలా మందికి మోస్ట్ ఫేవరెట్ ఫ్రూట్ ఇది.
సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో సీతాఫలం పండ్లు విరి విరిగా లభ్యం అవుతూ ఉంటాయి.
మధురమైన రుచితో పాటు సీతాఫలంలో విటమిన్ సి, విటమిన్ బి, ఐరన్, కాల్షియం, ప్రోటీన్ ఇలా ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.
అందుకే ఆరోగ్యపరంగా సీతాఫలం అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.అయితే సీతాఫలం ఆరోగ్యానికి మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటే పొరపాటే.
సీతాఫలంతో అందానికి కూడా మెరుగులు దిద్దవచ్చు. """/"/
ముఖ్యంగా సీతాఫలంను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే మీ చర్మం ఛాయ( Skin Glow ) పెరగడమే కాదు మరెన్నో స్కిన్ కేర్ బెనిఫిట్స్ పొందుతారు.
అందుకోసం ముందుగా బాగా పండిన ఒక సీతాఫలం ను తీసుకుని గింజ తొలగించి లోపల ఉండే గుజ్జును సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ సీతాఫలం గుజ్జు తో పాటు రెండు టేబుల్ స్పూన్ల పాలు, వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.
అనంతరం తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా రబ్ చేస్తూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
రెండు రోజులకు ఒకసారి సీతాఫలంతో ఈ రెమెడీని కనుక పాటిస్తే మీ స్కిన్ టోన్( Skin Tone ) అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.
"""/"/
చర్మం మురికి మృత కణాలు( Dead Skin Cells ) తొలగిపోతాయి.
మొండి మచ్చలు ఉంటే క్రమంగా తగ్గుముఖం పడతాయి.అంతేకాదు ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
సీతాఫలంలో మెండుగా ఉండే విటమిన్ సి ముడతలు త్వరగా రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.
మరియు చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా మారుస్తుంది.
కొడుకు డైరెక్ట్ చేసిన సినిమాకు తండ్రి రేటింగ్ ఎంతిచ్చారంటే?