ఒరిజినల్ పాన్ కార్డ్..నకిలీ పాన్ కార్డ్ మధ్య తేడాను ఎలా గుర్తించాలంటే..?
TeluguStop.com
భారతదేశంలో ఆదాయ పన్ను, ఆర్థిక సంబంధిత పనుల కోసం ఉపయోగించే ముఖ్యమైన పత్రాలలో పాన్ కార్డ్( Pan Card ) కూడా ఒకటి.
ఆదాయ పన్ను, ఇతర గుర్తింపు ప్రయోజనాల కోసం ఆదాయ పన్ను శాఖ( Income Tax Dept ) ద్వారా ఈ పాన్ కార్డ్ ( శాశ్వత ఖాతా సంఖ్య) అందించబడుతుంది.
ప్రభుత్వం పన్ను ఎగవేతలను, ప్రజల ఆర్థిక కార్యకలాపాలను చాలా సులభంగా ట్రాక్ చేయడానికి ఈ పాన్ కార్డు ఉపయోగపడుతుంది.
సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసం చేయడం కోసం నకలీ పాన్ కార్డులను( Fake Pan Cards ) ఉపయోగిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్న మోసాలలో పాన్ కార్డుల ద్వారా చేసే మోసాలు పెరుగుతున్నాయి.
దీంతో పాన్ కార్డ్ ఉపయోగించే వినియోగదారులు కాస్త ఆందోళనలో ఉన్నారు. """/" /
అయితే తమ వద్ద ఒరిజినల్ పాన్ కార్డు( Original Pan Card ) ఉందా లేదంటే నకిలీ పాన్ కార్డు ఉందా అనే విషయం ప్రతి పాన్ కార్డు వినియోగదారుడు తప్పకుండా తెలుసుకోవాలి.
ఆ తర్వాత పాన్ కార్డును వివిధ పనులలో ఉపయోగించుకోవాలి.మరి ఒరిజినల్ పాన్ కార్డ్, నకిలీ పాన్ కార్డ్ ల మధ్య తేడాను చాలా సులభంగా ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.
పాన్ కార్డ్ వినియోగదారుడు ముందుగా ల్యాప్ టాప్ లేదా స్మార్ట్ ఫోన్ లో ఇ-ఫైలింగ్ పోర్టల్( E-Filing ) ఓపెన్ చేయాలి.
ఇక్కడ వెరిఫై యువర్ పాన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది.దానిని సెలెక్ట్ చేస్తే ఓ కొత్త పేజీ ఓపెన్ అయ్యి, పాన్ కార్డ్ ఖాతాదారుని వివరాలు అడుగుతుంది.
పేరు, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ లాంటి వివరాలను పూరించి, ఓకే చేయాలి.
"""/" /
ఆ తరువాత కాసేపటికి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఒక మెసేజ్ వస్తుంది.
అందులో పాన్ కార్డ్ కు సంబంధించిన వివరాలు ఉంటాయి.అవి మీరు నమోదు చేసిన వివరాలతో సరిపోతే మీ వద్ద ఉండే పాన్ కార్డ్ ఒరిజినల్.
ఒకవేళ వివరాలలో ఎక్కడైనా తేడా వస్తే మీ వద్ద ఉన్నది నకిలీ పాన్ కార్డు అని తెలుసుకోవాలి.
తమ వద్ద ఉన్నది నకిలీ పాన్ కార్డ్ అని బయటపడితే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అధికారిక సైట్ కి వెళ్లి ఫిర్యాదు చేయడమో లేదంటే ఇన్కమ్ టాక్స్ శాఖను సంప్రదించి ఫిర్యాదు చేసి సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలి.
అప్పటివరకు నకిలీ పాన్ కార్డును ఎట్టి పరిస్థితులలో ఉపయోగించకూడదు.
అద్దె ఇంట్లో నివశిస్తున్న బాలీవుడ్ బడా హీరోయిన్.. రెంట్ తెలిస్తే షాకవ్వాల్సిందే!