మీ తేనె స్వచ్ఛమైనదా? కల్తీదా? అన్న‌ది సుల‌భంగా తెలుసుకోండిలా!

తేనె.ఎంతో మ‌ధురంగా ఉండ‌ట‌మే కాదు బోలెడ‌న్ని పోష‌కాల‌నూ క‌లిగి ఉంటుంది.

ఐర‌న్‌, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌, విట‌మిన్ బి, విట‌మిన్ సి, ప్రోటీన్‌, శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్‌.

ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు ఉండ‌టం వ‌ల్ల తేనె ఆరోగ్య ప‌రంగా, సౌంద‌ర్య ప‌రంగా అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూరిస్తుంది.

అయితే ఇటీవ‌ల రోజుల్లో స్వ‌చ్ఛ‌మైన తేనె దొర‌క‌డం చాలా క‌ష్ట‌మైపోయింది.ఎక్క‌డ చూసినా ర‌సాయ‌నాల‌తో నిండిన క‌ల్తీ తేనెలే ల‌భ్య‌మ‌వుతున్నాయి.

అస‌లు ఇంత‌కీ తేనె స్వచ్ఛమైనదా? లేక కల్తీదా? అన్న విష‌యాన్ని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

మొద‌ట ఒక వైట్ క్లాత్ తీసుకుని దానిపై మీరు రోజూ వాడే తేనెను కొద్దిగా వేయండి.

క‌ల్తీ తేనె అయితే క్లాత్ దానిని వెంట‌నే పీల్చేసుకుంటుంది.మ‌రియు క్లాత్‌పై మ‌ర‌క‌లు కూడా ప‌డ‌తాయి.

అదే స్వ‌చ్ఛ‌మైన తేనైతే క్లాత్ పీల్చుకోలేదు.అదే స‌మ‌యంలో ఎటువంటి మ‌ర‌క‌లూ ప‌డ‌వు.

అలాగే ఒక గ్లాస్ వాట‌ర్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్‌ తేనెను వేయండి.

స్వ‌చ్ఛ‌మైన తేనైతే అది నీటి అడుగు భాగంలోకి వెళ్లి క‌ర‌గ‌కుండా కొంత సేపు ఉంటుంది.

క‌ల్తీదైతే నీటిలో వెయ్యంగానే క‌రిగి పోతుంది. """/"/ వెనిగ‌ర్‌తోనూ తేనె స్వచ్ఛమైనదా? లేక‌ కల్తీదా? అన్న‌ది గుర్తించవ‌చ్చు.

అందు కోసం ఒక గ్లాస్‌లో వాట‌ర్ తీసుకుని.దాంట్లో రెండు స్పూన్ల వెనిగ‌ర్ వేసి బాగా మిక్స్ చేయండి.

ఇప్పుడు వెనిగ‌ర్ వాట‌ర్‌తో వ‌న్ టేబుల్ స్పూన్ తేనె వేయండి.నుర‌గ‌లు వస్తే మీరు వాడే తేనె క‌ల్తీదే.

లేకుంటే స్వ‌చ్ఛ‌మైన‌ది అని అర్థం.ఇక రంగు బ‌ట్టీ కూడా తేనె స్వచ్ఛమైనదో.

కాదో తెలుసుకో వ‌చ్చు.స్వ‌చ్ఛ‌మైన తేనె ప‌సుపు రంగులో కాకుండా కాస్త న‌ల్ల‌గా ఉంటుంది.

మ‌రియు మంచి స్మెల్ వ‌స్తుంటుంది.

లడ్డు కల్తీ వ్యవహారం… పవన్ వెనుక ఉన్నది ఆయనే రోజా సంచలన వ్యాఖ్యలు!