ఇలా చేస్తే చేతి గోళ్లు అందంగా విరిగిపోకుండా వారం రోజుల్లో పెరుగుతాయి

చాలా మంది అమ్మాయిలు చేతి గోళ్లను అందంగా, పొడవుగా ఉండాలని కోరుకుంటారు.దాని కోసం చాలా ప్రయత్నాలను చేస్తూ ఉంటారు.

కానీ గోర్లు త్వరగా పెరగవు.అలాగే పెరిగిన గోర్లు విరిగిపోతూ ఉంటాయి.

ఇప్పుడు చేతి గోళ్లు విరగకుండా తొందరగా పెరగాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం.కొంచెం టూత్ పేస్ట్ ని గోళ్లపై అప్ప్లై చేసి సున్నితంగా ఉండే టూత్ బ్రష్ సాయంతో సున్నితంగా రుద్దాలి.

ఆ తర్వాత గోళ్లను చల్లని నీటితో కడిగేయాలి.ఈ విధంగా స్క్రబ్ చేయటం వలన గోళ్ళ మీద ఉండే మలినాలు,ఫంగస్ తొలగిపోయి గోళ్లు ప్రకాశవంతంగా మారతాయి.

ఆ తర్వాత ఒక బౌల్ లోకి రెండు స్పూన్ల వాజిలిన్ తీసుకోని దానిలో రెండు విటమిన్ E కాప్సిల్ లోని ఆయిల్ ని వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ఒక డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు.ఈ విధంగా తయారుచేసుకున్న వెజిలిన్ మిశ్రమాన్ని రాత్రి పడుకొనే ముందు గోళ్లకు అప్ప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

ఈ విధంగా క్రమం తప్పకుండా వారం రోజుల పాటు చేస్తూ ఉంటే గోళ్లు విరిగిపోకుండా తొందరగా పెరుగుతాయి.

ఇంకా తొందరగా మంచి ఫలితాలు రావాలంటే వెజిలిన్ మిశ్రమాన్ని రోజులో రెండు సార్లు గోళ్లకు రాయవచ్చు.

"""/"/ ఇది గోళ్లకు తేమను అందించి గోళ్లు అందంగా, కాంతివంతంగా ఉండేలా సహాయపడుతుంది.

అంతేకాక గోళ్లు విరిగిపోకుండా బలంగా ఉంటాయి.మీ గోళ్లు తరచుగా విరిగిపోతూ ఉంటే కనుక మీ గోళ్లకు ఎప్పుడు నైల్ పోలిష్ ఉండేలా చూసుకోవాలి.

నైల్ పోలిష్ గోళ్లు విరిపోకుండా బలంగా ఉండేలా చేస్తుంది.మీ చేతి గోళ్లు విరిగిపోకుండా అందంగా పెరగాలంటే ఈ చిట్కాను తప్పనిసరిగా ఫాలో అవ్వండి.

అమెరికా నుంచి తిరిగొచ్చిన భారతీయుల డిమాండ్లు విన్నారా.. వింటే ఛీకొడతారు..