బాదం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా.. ఇలా వాడితే మీ ముఖం తెల్లగా మెరిసిపోతుంది!

బాదం పప్పు గురించి పరిచయం అక్కర్లేదు.నట్స్ లో ఒకటైన బాదం పప్పు లో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ తో సహా ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.

అందుకే ఆరోగ్యపరంగా బాదం పప్పు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.అయితే ఆరోగ్యానికి మాత్రమే బాదంపప్పు ఉపయోగపడుతుంది అనుకుంటే పొరపాటే అవుతుంది.

ఎందుకంటే చర్మ సౌందర్యానికి కూడా బాదం అద్భుతంగా సహాయపడుతుంది.ముఖ్యంగా బాదం పప్పు తో ముఖ చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిపించుకోవచ్చు.

మరి ఇంతకీ ఇచ్చారు చ‌ర్మానికి బాదం పప్పును ఎలా వాడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు డ్రై రోస్ట్ చేసిన బాదం పప్పు వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ బాదం పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బాదం పౌడర్ ను వేసుకోవాలి.

"""/" / అలాగే వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి.

చివరిగా సరిపడా రోజు వాటర్ వేసి అన్నీ కలిసేంతవరకు స్పూన్ సహాయంతో బాగా కలపాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే మీ చర్మం కొద్ది రోజుల్లోనే సూపర్ వైట్ గా మారుతుంది.

చర్మం పై ఎలాంటి మొండి మచ్చలు ఉన్నా సరే క్రమంగా మాయం అవుతాయి.

చాలామంది డ్రై స్కిన్ తో బాధపడుతూ ఉంటారు.అయితే బాదం లో ఉండే పలు సుగుణాలు చర్మాన్ని తేమ గా ఉంచడానికి అద్భుతంగా సహాయపడతాయి.

డ్రై స్కిన్ సమస్య నుంచి బయటపడేందుకు హెల్ప్ చేస్తాయి.ఈ రెమెడీని రోజుకు ఒకసారి పాటిస్తే మీ స్కిన్ స్మూత్ గా షైనీగా మెరుస్తుంది.

వైరల్ వీడియో: పాఠాలు వింటూనే గుండెపోటుకు గురైన చిన్నారి.. చివరకి?