కరోనా తర్వాతా జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
TeluguStop.com
కరోనా వైరస్ ఎవర్నీ వదిలి పెట్టడం లేదు.నలువైపుల నుంచి ఎటాక్ చేస్తున్న ఈ మాయదారి వైరస్ ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తోంది.
ముఖ్యంగా కొందరు కరోనా నుంచి కోలుకున్నాక కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు.అటువంటి సమస్యల్లో హెయిర్ ఫాల్ ప్రధానంగా కనిపిస్తోంది.
వైరస్ వల్ల శరీరంలో వచ్చే పలు మార్పుల కారణంగా హెయిర్ ఫాల్ వేధిస్తుంటుంది.
అయితే కరోనా తర్వాత కూడా జుట్టును ఒత్తుగా పెరగాలని కోరుకునే వారు పలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ వంటి పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెరిగేలా చేయడంలో అద్భుతంగా సమాయపడతాయి.
కాబట్టి, ఈ పోషకాలు ఉండే ఫుడ్స్‌ను రెగ్యులర్‌గా తీసుకోవాలి.అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో మూడు స్పూన్ల పెరుగు, మూడు స్పూన్ల కలబంద జెల్ మరియు అర స్పూన్ నీమ్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి గంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
ఇలా వారంలో రెండు సార్లు చేశారంటే.కలబంద, పెరుగు, నీమ్ ఆయిల్‌లో ఉండే పోషకాలు జుట్టుకు బలాన్ని అందించి రాలడాన్ని నివారిస్తాయి.
మరియు ఒత్తుగా పెరిగేందుకు సమాయపడతాయి. """/"/
జుట్టుకు ఏ నూనెలు పడితే ఆ నూనెలు కాకుండా బాదం ఆయిల్, జోజోబా ఆయిల్, పిప్పరమింట్ ఆయిల్ వంటివి వాడాలి.
తద్వారా హెయిర్ ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.కొందరు రకరకాల డైటింగ్లు చేస్తూ శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడం మానేస్తారు.
ఈ కారణంగా కూడా జుట్టు ఆరోగ్యం దెబ్బ తింటుంది.కాబట్టి, డైట్‌లో పోషకాహరం ఉండేలా చూసుకోండి.
అదే సమయంలో ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, నిల్వ పచ్చళ్లు, కెఫిన్, కూల్‌డ్రింక్స్, స్వీట్స్ వంటి వాటికి దూరంగా ఉంటాయి.
ఇక ఇవే కాకుండా ఒత్తిడిని తగ్గించుకోవాలి.రెగ్యులర్‌గా కాకుండా వారానికి రెండు సార్లు మాత్రమే హెడ్ బాత్ చేయాలి.
కెమికల్స్ ఎక్కువగా షాంపూలు, కండీషనర్స్ వాడటం నివారించుకోవాలి.
మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?