నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారాలంటే...బెస్ట్ టిప్స్

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు నల్లని పెదాలతో ఇబ్బంది పడుతున్నారు.నల్లని పెదాల కారణంగా ఆత్మవిశ్వాసం లోపిస్తుంది.

ప్రతి ఒక్కరు పెదాలు గులాబీ రంగులో ఉండాలని కోరుకుంటూ ఉంటారు.గులాబీ పెదాల కోసం లిప్ స్టిక్స్, టింటేడ్ లిప్ బామ్స్ వంటి కాస్మెటిక్స్ ని ఉపయోగించిన అవి తాత్కాలికంగానే పనిచేస్తాయి.

అందుకే కొన్ని సహజసిద్ధమైన పద్దతుల ద్వారా నల్లని పెదాలను గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు.వాటి గురించి వివరంగా తెలుస్కుందాం.

బీట్ రూట్ ముక్కతో పెదాలను రుద్దాలి.పెదాలపై బీట్ రూట్ జ్యుస్ పది నిముషాలు ఉండేలా చేసుకోవాలి.

ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా రోజులో ఒక్కసారి చేస్తూ ఉంటే గులాబీ రంగు పెదాలు అవుతాయి.

నల్లని పెదాలను గులాబీ రంగులోకి మార్చటానికి టమోటా గుజ్జు చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.టమోటా గుజ్జును పెదాలపై రాసి సున్నితంగా 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.

ఈ విధంగా రోజులో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"//p రోజ్ వాటర్ లో కాటన్ బాల్ ముంచి నల్లని పెదాలపై రాసి ఒక నిమిషం మసాజ్ చేయాలి.

ఈ విధంగా రోజులో మూడు సార్లు చేస్తే త్వరలోనే పెదాలు గులాబీ రంగులోకి మారతాయి.

దానిమ్మరసంలో కాటన్ బాల్ ముంచి పెదాలకు రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

ఇప్పుడు చేయబోయే సినిమాతో రామ్ పోతినేని సూపర్ హిట్ కొడుతాడా..?