నాలుగు మందారం ఆకులు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే సిల్కీ హెయిర్ పొందవచ్చు!

సాధారణంగా చాలా మంది అమ్మాయిలు సిల్కీ హెయిర్( Silky Hair ) ను బాగా ఇష్టపడుతుంటారు.

సిల్కీ హెయిర్ చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది.అందాన్ని రెట్టింపు చేస్తుంది.

అందుకే సిల్కీ హెయిర్ ను పొందడం కోసం కెరాటిన్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు.ఇందుకోసం వేలకు వేలు ఖర్చు పెడతారు.

కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే కేవలం నాలుగు మందారం ఆకుల( Hibiscus Leaves )తో సిల్కీ హెయిర్ ను పొందవచ్చు.

అవును, మీరు విన్న‌ది నిజ‌మే.మరి ఇంతకీ మందారం ఆకులను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా నాలుగు మందారం ఆకులను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే రెండు మందారం పువ్వులను ( Hibiscus Flowers )కూడా తీసుకుని తుంచి పెట్టుకోండి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో మందారం పువ్వులు ఆకులు వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.

"""/" / ఆపై స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు రెగ్యులర్ షాంపూను వేసి బాగా మిక్స్ చేయాలి.

ఈ వాటర్ ను ఉపయోగించి తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా హెయిర్ వాష్ చేసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

"""/" / ముఖ్యంగా మందారం ఆకులు, పువ్వుల్లో ఉండే పలు సుగుణాలు జుట్టును సిల్కీగా స్మూత్ గా మార్చడానికి అద్భుతంగా తోడ్పడతాయి.

అదే సమయంలో జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.హెయిర్ ఫాల్( Hair Fall ) కు అడ్డుకట్ట వేస్తాయి.

జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.కాబట్టి లాంగ్‌, థిక్ అండ్ సిల్కీ హెయిర్ ( Silky Hair )ను పొందాలని కోరుకునేవారు తప్పకుండా పైన చెప్పిన రెమెడీని పాటించండి.

బరువు పెరగాలంటూ కామెంట్ చేసిన నెటిజన్.. సమంత ఇచ్చిపడేసిందిగా!