తెల్ల జుట్టును మాయం చేసే కాఫీ పౌడర్.. ఎలా వాడాలో తెలుసా?
TeluguStop.com
చిన్న వయసులోనే తెల్ల జుట్టు( White Hair ) సమస్యతో బాధపడుతున్నారా.? తెల్ల జుట్టుతో బయట కాలు పెట్టడానికే అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారా.
? తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు రంగులు వేసుకుంటున్నారా.? అయితే మీకు కాఫీ పౌడర్( Coffee Powder ) ఉత్తమంగా సహాయపడుతుంది.
కాఫీ పౌడర్ ను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే కలర్స్ అక్కర్లేదు.సహజంగానే తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం తెల్ల జుట్టును మాయం చేసే కాఫీ పౌడర్ ను ఎలా వాడాలో తెలుసుకుందాం పదండి.
"""/" /
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ వేసి పది నుంచి పన్నెండు నిమిషాలు పాటు మరిగించాలి.
ఆపై స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో కాఫీ డికాక్షన్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ కాఫీ డికాక్షన్ లో వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలిపి దగ్గర పడే వరకు ఉడికించాలి.
"""/" /
ఇలా ఉడికించిన మిశ్రమం కాస్త చల్లారిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్ ( Henna Powder )వేసి బాగా మిక్స్ చేసి గంట పాటు వదిలేయాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.
తెల్ల జుట్టును నివారించడానికి ఈ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.కాబట్టి తెల్ల జుట్టుతో సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.
పైగా ఈ రెమెడీని పాటిస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.జుట్టు ఒత్తుగా, పొడుగ్గా సైతం పెరుగుతుంది.
బాలయ్య దబిడి దిబిడి సాంగ్ కోసం ఊర్వశి షాకింగ్ రెమ్యూనరేషన్.. ఎంతంటే?