`విటమిన్ డి` లోపాన్ని దూరం చేసే బెస్ట్ ఫుడ్ ఇదే!
TeluguStop.com
నేటి కాలంలో చాలా మంది `విటమిన్ డి` లోపానికి గురవుతున్నారు.కండరాలు, ఎముకలు ప్రతి ఒక్క భాగం ఆరోగ్యంగా ఉండాలంటే.
విటమిన్-డి చాలా అవసరం.అలాంటి విటమిన్ డి లోపిస్తే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.
ముఖ్యంగా విటమిన్ డి లోపించడం వల్ల ఎముకలు, కండరాలు బలహీనపడడం, శరీర రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, జుట్టు రాలడం, అలసట, నీరసం ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే సూర్యరశ్మి తాకితే శరీరంలో విటమిన్ డి ఉత్పత్తవుతుంది.కానీ, నేటి ఉరుకులు పరుగులు జీవితంలో ఎవరికీ కూడా సూర్యరశ్మి ముందు కనీసం ఐదు నుంచి పది నిమిషాలు నిలబడే సమయమే దొరకడం లేదు.
అయితే విటమిన్ డి కేవలం సూర్యరశ్మి నుంచే కాదు.కొన్ని ఆహార పదార్థాల ద్వారా కూడా భర్తీ చేయవచ్చు.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.విటమిన్ డి పొందాలంటే ఖచ్చితంగా ఒక గుడ్డును డైట్‌లో చేర్చుకోవాలి.
ఎందుకంటే, శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను అందించే గుడ్డులో విటమిన్ డి కూడా ఉంటుంది.
పాలు మరియు పాల ఉత్పత్తులు అంటే ఛీజ్, పన్నీర్, నెయ్యి, వెన్న, పెరుగు ఇవి ప్రతి రోజు మోతాదు మించకుండా తీసుకోవాలి.
ఎందుకంటే, వీటిలో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.అలాగే రొయ్యలు మరియు చేపలను వారానికి కనీసం ఒకసారి లేదా రెండు సార్లు అయినా తినాలి.
ఎందుకంటే.వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు విటమిన్ డి కూడా లభ్యమవుతుంది.
అదేవిధంగా, ఓట్ మీల్ ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఓట్ మీల్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వడంతో పాటు అనేక జబ్బులు నుంచి కూడా రక్షణ లభిస్తుంది.
అదే సమయంలో విటమిన్ డి కూడా శరీరానికి లభిస్తుంది.మరియు తాజా పండ్లు కూడా తీసుకోవాలి.
ఈ ఆహార పదార్థాలు డైట్‌లో చేర్చుకోవడంతో పాటు రోజుకు కనీసం ఐదు నిమిషాల పాటు సూర్యరశ్మి తగిలేలా ఉంటే విటమిన్ డి లోపాన్ని సులువుగా అదిగమించవచ్చు.
పులినే తరిమికొట్టిన పెంపుడు కుక్క.. ఈ వీడియో చూస్తే..