చిట్లిన జుట్టుతో చింతిస్తున్నారా? అయితే వెంట‌నే ఇలా చేయండి!

సాధార‌ణంగా కొంద‌రి జుట్టు త‌ర‌చూ చిట్లిపోతూ ఉంటుంది.అలా చిట్లిన జుట్టును ఎన్ని సార్లు క‌త్తిరించిన‌ప్ప‌టికీ.

మ‌ళ్లీ అదే స‌మ‌స్య రిపీట్ అవుతుంటుంది.దాంతో చిట్లిన జుట్టును రిపేర్‌ చేసుకోవ‌డానికి విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

హెయిర్ ఆయిల్స్‌, షాంపూల‌ను మారుస్తుంటారు.వారంలో ఒక‌టి, రెండు సార్లు హెయిర్ ప్యాకులు, మాస్క్‌లు వేసుకుంటారు.

అయిన‌ప్ప‌టికీ ప్ర‌యోజ‌నం లేకుంటే ఏం చేయాలో అర్థంగాక మ‌ద‌న ప‌డుతూ ఉంటారు.ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.

? అయితే అస్స‌లు చింతించ‌కండి.ఎందుకుంటే, ఇప్పుడు చెప్ప‌బోయే రెమెడీని ట్రై చేస్తే చిట్లిన జుట్టుకు బై బై చెప్పవచ్చు.

మ‌రి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల కొక‌న‌ట్ ఆయిల్‌, మూడు టేబుల్ స్పూన్ల విట‌మిన్ ఇ ఆయిల్ వేసుకుని రెండు క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత అందులో వ‌న్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వ‌న్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడ‌ర్‌, హాఫ్ టేబుల్ స్పూన్ ల‌వంగాల పొడి వేసి మ‌ళ్లీ క‌లుపుకోవాలి.

"""/"/ ఇప్పుడు వీట‌న్నిటినీ డ‌బుల్ బాయిల‌ర్ మెథ‌డ్‌లో ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు హీట్ చేసి చ‌ల్లార‌బెట్టుకోవాలి.

పూర్తిగా కూల్ అయ్యాక‌.ప‌ల్చ‌టి వ‌స్త్రం సాయంతో ఆయిల్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఇక ఆ ఆయిల్‌ను జుట్టు చివ‌ర్ల‌న మాత్ర‌మే కాకుండా మొత్తానికి ప‌ట్టించాలి.రాత్రి నిద్రించే ముందు ఈ ఆయిల్ ను రాసుకుని.

ఉద‌యాన్నే మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి.

ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే చిట్లిన జుట్టు నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

అదే స‌మ‌యంలో హెయిర్ ఫాల్ స‌మ‌స్య సైతం క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుంది.

ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తే తొక్కేస్తారా.. గెటప్ శ్రీను షాకింగ్ కామెంట్స్ వైరల్!