మీ దంతాలు సెన్సిటివ్‌గా ఉన్నాయా? అయితే ఇవి తెలుసుకోండి!

సాధార‌ణంగా కొంద‌రి దంతాలు చాలా సెన్సిటివ్ (సున్నితం)గా ఉంటాయి.దాని వ‌ల్ల వేడి లేదా చ‌ల్ల‌టి ఆహారాలు, పానియాలు తీసుకున్న‌ప్పుడు దంతాలు జివ్వుమని లాగేసి తీవ్ర నొప్పిని క‌ల‌గ‌జేస్తాయి.

ఇలా మీకు జ‌రుగుతుందా.? అయితే మీరు కొన్ని జాగ్ర‌త్త‌లు, అలాగే మ‌రి కొన్ని చిట్కాలు ఖ‌చ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

మ‌రి లేట్ చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం పదండి ప‌దండీ.సెన్సిటివ్ దంతాలు క‌లిగి ఉండే వారు.

ఎడా పెడా బ్రెష్ చేయ‌డం, ఎక్కువ స‌మ‌యం పాటు బ్రెష్ చేయ‌డం చేయ‌రాదు.

రెండంటే రెండే నిమిషాలు దంతాల‌ను తోముకోవాలి.అదే స‌మ‌యంలో దంతాల‌కు సున్నిత‌మైన బ్రెష్‌నే వాడాలి.

మ‌రియు ఏదైనా ఆమ్ల ఆహారాలు తిన్న వెంట‌నే బ్ర‌ష్ చేయ‌రాదు.అలాగే ల‌వంగాల‌తో సెన్సిటివ్ దంతాల‌ను సుల‌భంగా నివారించుకోవ‌చ్చు.

కొన్ని ల‌వంగాల‌ను మెత్త‌గా పొడి చేసి.అందులో ఆలివ్ ఆయిల్‌ను యాడ్ చేసి పేస్ట్‌లా త‌యారు చేసుకోవాలి.

ఈ పేస్ట్‌తో దంతాల‌ను తోముకోవాలి.వారంలో రెండు సార్లు ఇలా చేస్తే దంతాలు తెల్ల‌గా మార‌డంతో పాటు దృఢంగా మార‌తాయి.

"""/"/ సెన్సిటివ్ దంతాలు క‌ల‌వారు షుగ‌ర్ ఫుడ్స్‌, కూల్ డ్రింక్స్‌, ఆల్క‌హాల్‌, ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

అదే స‌మ‌యంలో ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయల‌తో పాటుగా పాలు, పెరుగు, న‌ట్స్ వంటివి డైట్‌లో చేర్చుకోవాలి.

"""/"/ సెన్సిటివ్ దంతాల‌ను నివారించడంలో కొబ్బరినూనె అద్భుతంగా స‌మాయ‌ప‌డుతుంది.సేంద్రీయ కొబ్బరినూనెను నోట్లో వేసుకుని 20 నిమిషాల పాటు బాగా పుక్కిలించి.

ఆపై వాట‌ర్‌తో శుభ్రం చేసుకుంటే దంతాల సున్నితత్వం త‌గ్గు ముఖం ప‌డుతుంది.ఇక జామ ఆకుల‌తోనూ సెన్సిటివ్ దంతాల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద వ‌చ్చు.

అందు కోసం ముందుగా ఒక కప్పు నీటిలో నాలుగు లేదా ఐదు జామ ఆకులను చేర్చి బాగా మ‌రిగించి.

చ‌ల్లార‌నివ్వాలి.అనంత‌రం ఆ వాట‌ర్‌తో మౌత్ వాష్ చేసుకోవాలి.

ఇలా రోజూ చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

రాజీనామా లేఖను తీసుకొని వస్తారా.? సీఎం రేవంత్ కు హరీశ్ రావు మరో సవాల్..!!