క‌ళ్లు త‌ర‌చూ ఎర్ర‌బ‌డుతున్నాయా..అయితే ఈ టిప్స్ మీకే!

క‌ళ్లు త‌ర‌చూ ఎర్ర బ‌డ‌టం.చాలా మంది కామ‌న్‌గా ఫేస్ చేసే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

క‌ళ్లు ఎర్ర బ‌డ‌టానికి చాలా కార‌ణాలు ఉన్నాయి.ఆహార‌పు అల‌వాట్లు, స‌రిగ్గా నిద్ర ‌పోక‌పోవ‌డం, ఒత్తిడి, ఎక్కువ స‌మ‌యం పాటు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్స్ చూడ‌టం, శ‌రీరంలో వేడి ఎక్కువ‌వ‌డం, అల‌ర్జీ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల క‌ళ్లు ఎర్ర బ‌డుతూ ఉంటాయి.

ఆ స‌మ‌యంలో క‌ళ్ల‌ను మ‌ళ్లీ మామూలు స్థితికి ఎలా తీసుకురావాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతూ ఉంటారు.

అయితే కొన్ని కొన్ని సింపుల్ టిప్స్‌ను పాటిస్తే.సుల‌భంగా ఎర్ర బ‌డిన క‌ళ్ల‌ను నివారించుకోవ‌చ్చు.

మ‌రి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.కొబ్బరి నూనె కంటి ఎరును త‌గ్గించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

దూదె సాయంతో కొబ్బ‌రి నూనెను క‌ళ్ల‌పై బాగా అప్లై చేయాలి.ఇలా త‌ర‌చూ చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

అలాగే ఎర్ర బ‌డిన క‌ళ్లను నివారించుకోవాలంటే.నిద్ర‌ను అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు.

క‌నీసం రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంట‌లు నిద్రిస్తే.క‌ళ్లు మామూలు స్థితికి వ‌స్తాయి.

మ‌రియు త‌ర‌చూ ఎర్ర బ‌డ‌కుండా ఉంటాయి. """/" / అలాగే క‌ల‌బంద‌తో కూడా ఎర్ర బ‌డిని క‌ళ్ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

ఇంట్లో పెంచే క‌ల‌బంద నుంచి గుజ్జు తీసుకుని.వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా క‌ళ్ల‌పై అప్లే చేసుకోవాలి.

ఇలా చేస్తూ ఉండే క్ర‌మంగా కంటి ఎరుపు త‌గ్గు ముఖం ప‌డుతుంది.ఐస్ క్యూట్‌ను ఒక కాట‌న్ క్లాత్‌లో వేసి త‌ర‌చూ క‌ళ్ల‌పై అద్దు కుంటూ ఉండాలి.

ఇలా చేసినా ఎర్ర బ‌డిన క‌ళ్లు మ‌ళ్లీ మామూలు స్థితికి చేర‌కుంటాయి.ఇక పైన చెప్పుకున్న‌ట్టు శ‌రీరం వేడికి గురైనా క‌ళ్లు ఎర్ర బ‌డ‌తాయి.

అందు వ‌ల్ల‌, ఖ‌చ్చితంగా డైట్‌లో కొన్ని ఆహారాల‌ను చేర్చుకోవాలి.ముఖ్యంగా కొబ్బ‌రి నీరు, మ‌జ్జిగ, తాజా పండ్లు, పండ్ల జ్యూసులు, మెంతులు, పుదీనా, లెమ‌న్ వాట‌ర్ ఇలాంటివి తీసుకుంటే కంటి ఎరుపు స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

యూఎస్: కోటీశ్వరులు దాక్కునేందుకు సీక్రెట్ బంకర్.. ఇందులో ఉంటే ప్రళయం వచ్చినా టెన్షన్ లేదు!