కండ్ల కలకతో బాధపడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి!

ప్రస్తుత వర్షాకాలంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యలో కండ్ల కలక ( Pink Eye )ఒకటి.

గత పది రోజుల నుంచి కండ్ల కలక బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

ఇంట్లో ఒకరికి కండ్ల కలక వచ్చిందంటే చాలు మిగిలిన వారు కూడా వేగంగా ఎఫెక్ట్ అవుతారు.

ఎందుకంటే కండ్ల కలక అంటువ్యాధి.కండ్ల కలక వచ్చినప్పుడు కళ్ళు బాగా ఎర్రబడి పోతాయి.

కళ్ళల్లో మంట, నొప్పి, కొంచెం దురద వంటివి ఉంటాయి.నిద్రపోయేటప్పుడు కళ్ళు అతుక్కుపోతాయి.

కళ్ళల్లో నుంచి నీరు కారడం, చూడటానికి కాస్త కష్టంగా ఉండటం, కళ్ళల్లో పూసలు వంటివి కండ్ల కలక లక్షణాలు.

"""/" / సాధారణ కండ్ల కలక వస్తే వారం రోజులు ఇబ్బంది పెట్టి ఆ తర్వాత తగ్గిపోతుంది.

అదే వైరస్ తో కూడిన కండ్ల కలక వస్తే మాత్రం దాదాపు మూడు వారాలు ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

పైగా కండ్ల కలక వచ్చిన వారిలో ఎక్కువ శాతం మంది జలుబు, దగ్గు, జ్వరం( Fever )తో బాధపడుతుంటారు.

అసలు కండ్ల కలక వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.ఆ సమస్య నుంచి ఎలా త్వరగా బయటపడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / కండ్ల కలక వచ్చినప్పుడు తరచూ చేతులతో కళ్ళను తాకరాదు.ఎందుకంటే చేతులకు ఉండే బ్యాక్టీరియా కళ్ళల్లోకి చేరి ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువ అవుతుంది.

అలాగే కండ్ల కలక వచ్చినప్పుడు తరచూ వాటర్ తో కళ్ళను వాష్ చేసుకుంటూ ఉండాలి.

ఇలా చేయడం వల్ల కండ్ల కలక త్వరగా తగ్గుతుంది.వాటర్ ను ఎక్కువగా తీసుకోవాలి.

బాడీని హైడ్రేటెడ్‌ గా ఉంచుకుంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా పరార్ అవుతాయి.కండ్ల కలక వచ్చినప్పుడు పొరపాటున కూడా కాంటాక్ట్ లెన్స్ వాడకండి.

ఇలా చేస్తే కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంటుంది.కండ్ల కలక వచ్చినప్పుడు వైద్యులు సూచించిన యాంటీబయోటిక్ డ్రాప్స్( Antibiotic Drops ) ని వినియోగించాలి.

మరియు కండ్ల కలక ఒకరి నుంచి ఒకరికి ఈజీగా పాస్ అవుతుంది.కాబట్టి కండ్లు కలక వచ్చిన వారు ఇతరులకు దూరంగా ఉండండి.

ఒకవేళ వేరే వాళ్లను కలవాల్సి వస్తే దూరంగా ఉండి కళ్ళకు గ్లాసెస్ పెట్టుకొని మాట్లాడండి.

ఆక్సిజన్ మాస్క్ తో సినిమా షూటింగ్.. సమంత కష్టాలకు కన్నీళ్లు పెట్టిన హీరో?